చరిత్ర సృష్టించిన నాని.. స్టార్ హీరోలకి ముచ్చెమటలు

నేచురల్ స్టార్ నాని ఇప్పుడు ఎంత జోరులో ఉన్నాడో అందరికీ తెలుసు. ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమా దగ్గరి నుంచి మొదలుకుని.. ఇప్పటివరకు వరుస హిట్ల పరంపర కొనసాగిస్తున్నాడే తప్ప బ్రేక్ వేయడం లేదు. కేవలం అక్కడితో ఆగడం లేదు.. తన మార్కెట్ వ్యాల్యూ పెంచుకుంటూ పోతూనే, కలెక్షన్ల పరంగానూ రికార్డులు కొల్లగొడుతున్నాడు. గతేడాది అయితే.. స్టార్ హీరోలకి కూడా సాధ్యంకాని అరుదైన ఘనత తన పేరిట లిఖించుకున్నాడు.

గతేడాది నాని ఎప్పట్లాగే మూడు సినిమాలు రిలీజ్ చేశాడు. అవి కేవలం హిట్‌గా నిలవడమే కాకుండా కలెక్షన్ల సునామీతో బాక్సాఫీస్‌ని షేక్ చేసి.. ఓవరాల్‌గా రూ.100 కోట్ల షేర్ మార్క్‌ని దాటేశాయి. మొదటగా ‘నేను లోకల్’ చిత్రం రిలీజవ్వగా అది రూ.37 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ రాబట్టింది. ఆ తర్వాత రిలీజైన ‘నిన్ను కోరి’ రూ.29 కోట్లు, అలాగే ఏడాది చివర్లో విడుదలైన ‘ఎంసీఏ’ రూ.40 కోట్ల షేర్స్ కొల్లగొట్టాయి. ఈ మూడు సినిమాల లెక్కల్ని కలపగా.. ఓవరాల్‌గా రూ.106 కోట్లు నమోదైంది. దీంతో.. ఒక క్యాలెండర్ ఇయర్‌లో రూ.100 కోట్ల షేర్ మార్క్ అందుకున్న హీరోగా నాని అల్టిమేట్ రికార్డ్ సృష్టించాడు.

ప్రభాస్ (బాహుబలి సీరీస్), చిరంజీవి (ఖైదీ నెం.150) తప్ప టాలీవుడ్‌లో రూ.100 కోట్ల షేర్ మార్క్‌ని అందుకున్న హీరోలు మరెవ్వరూ లేరు. ఇతర స్టార్ హీరోలకు ఆ సత్తా ఉన్నప్పటికీ.. చెత్త సినిమాలు చేసి చిత్తైపోతున్నారు. కనీసం రూ.50 కోట్ల ఫీట్‌ని కూడా అందుకోలేక సతమతమైపోతున్నారు. కానీ.. నాని మాత్రం సింపుల్ సినిమాలతో ఆ ఫీట్స్ అందుకుని, స్టార్ హీరోలకే ముచ్చెమటలు పట్టిస్తున్నాడు.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.