ట్విట్టర్ సాక్షిగా.. ఇవాంకా మీద నవదీప్ ఎటాక్!

హైదరాబాద్‌లో ఈనెల 28, 29, 30 తేదీల్లో జరగనున్న ‘గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ సమ్మిట్’లో పాల్గొనేందుకు యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ నగరానికి విచ్చేసిన విషయం తెలిసిందే. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నో ఏర్పాట్లు చేయడంతోపాటు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించిందిలెండి!

తమ గౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం ట్రాఫిక్ సమస్యలు ఏమాత్రం తలెత్తకుండా చాలా కేర్ తీసుకుంది. బిచ్చగాళ్ల బెడద లేకుండా మరో ప్రాంతానికి వాళ్లని షిఫ్ట్ వేయడం, కొత్త రోడ్ల నిర్మాణం, రంగురంగుల పెయింటింగ్.. అబ్బో మునుపెన్నడూ లేని విధంగా నగరాన్ని రంగులమయంగా మార్చేశారు. అలాగే.. ఇవాంకా ప్రయాణించే రోడ్లలో ట్రాఫిక్ లేకుండా వేరే రూట్లకి వాహనాల్ని డైవర్ట్ చేశారు. దీంతో.. మంగళవారం ఉదయం 10 గంటల టైంలో హైదరాబాద్ మొత్తంలో భారీ ట్రాఫిక్ ఏర్పడింది.

ఇక అంశాన్ని ప్రస్తావిస్తూ హీరో నవదీప్ ట్విట్టర్ వేదికగా ఒక కామెడీ సెటైర్ వేశాడు. ‘‘బైటికెళ్లి చూస్తే టైమ్ ఏమో 10’ఓ క్లాక్.. ఇంటికెళ్లే రోడ్ మొత్తం ఇవాంకా రోడ్ బ్లాక్’’ అంటూ ‘అజ్ఞాతవాసి’ సాంగ్ ట్యూన్‌లో తన ఫ్రస్టేషన్ వ్యక్తపరిచాడు. పవన్ సినిమా పాట ట్యూన్‌లో ట్వీట్ చేయడంతో.. ఇది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

Related posts:
ఆయ‌న దూకుడు ఆగ‌దు...రేవంత్‌కు వైఫ్ గీత ప్ర‌శంస‌లు
'నాన్నకు ప్రేమతో' వివాదంపై నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ స్పందన
చీటింగ్ కేసులో ఇరుక్కున్న జక్కన్న.. సమన్లు జారీ చేసిన కోర్టు
దాన్ని మగవారికంటే ఆడవాళ్ళే ఎక్కువ వాడుతున్నారట!
పెళ్ళికి ముందే కమిట్ అయ్యారు.. అడ్డంగా బుక్కయ్యారు!
జోహార్ విశాల్.. రీల్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ మనసున్న హీరో

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.