కొత్త సినిమాలకు కోట్లు కుమ్మరించాడు..రొటీన్ రొట్ట సినిమాలను నిలబెట్టి నరికేశాడు

ఒకప్పుడు తెలుగు సినిమా అంటే 6 పాటలు , 6 ఫైట్లు , మధ్య మధ్యలో కొన్ని కామెడీ సీన్లు. అదే రొటీన్ ఫార్ములాతో ఎన్నో హిట్లు కూడా కొట్టారు. కానీ ‘కాలం’ మారింది ఇప్పుడు ‘కలం’ కూడా మారాల్సిన సమయం వచ్చింది.గత రెండు మూడు సంవత్సరాలలో తెలుగు ప్రేక్షకుడి అభిరుచిలో ఎంతో మార్పు.. ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా సరే రొటీన్ అయితే.. ఏమాత్రం ఆలోచించకుండా అడ్డంగా నిలబెట్టి నరికేశాడు. కోట్లలో నష్టం చవి చూసారు సదరు సినిమా కొన్న వాళ్ళు మరియు నిర్మించిన వాళ్ళు.ఈ మధ్య కాలంలో వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ , బ్రహ్మోత్సవం, కాటమరాయుడు , బ్రూస్లీ, స్పైడర్ లాంటి భారీ బడ్జెట్ సినిమాలను కూడా మట్టి కరిపించాడు. అలాగే కొత్త కథ లు నిజాయితీ గా చెబితే మాత్రం నెత్తిన పెట్టుకొని కొన్ని కోట్లు కుమ్మరించాడు. ఇదే కాలంలో వచ్చిన పెళ్లి చూపులు, క్షణం , బిచ్చగాడు , ఫిదా ,నిన్ను కోరీ, అర్జున్ రెడ్డి , గరుడ వేగ లాంటి కొత్త కాన్సెప్ట్ లతో వచ్చిన సినిమాలకు విజయ హారతులు పట్టాడు.

ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా సరే ఒక సినిమాను నిలబెట్టేది ఆ సినిమా కథ, మరియు కథా గమనాలే అన్న విషయం మరచిపోకూడదు. స్టార్ అయితే ఒకటి రెండు రోజులు కలెక్షన్లు ఎక్కువ రప్పించగలడేమో కానీ ఆ సినిమాని లాభాల బాట మాత్రం పట్టించలేడు అనేది జగమెరిగిన సత్యం. ఈ మధ్య కొన్ని సినిమాల ఫలితాలు చూసినా ఇట్టే అర్థమైపోతుంది. హీరో అభిమానులు వేరు , నికార్సయిన సినీ అభిమాని వేరు. ఈ తేడాని గుర్తించాలి. కేవలం హీరోల అభిమానుల కోసం మాత్రమే తీసిన సినిమాల ఫలితం ఏమయిందో అందరికీ తెలిసిన విషయమే.దానికి ఉదాహరణ బాలయ్య పైసా వసూల్ సినిమానే చెప్పుకోవచ్చు..ఇంకా ఒక సర్దార్ ఇలా ఎన్నో ఎన్నెన్నో. కలెక్షన్లు అంటే మొదటి మూడు రోజుల పాటు వచ్చేవి కాదని.. అసలైన సినీ అభిమాని మెచ్చినప్పుడు వచ్చేవి అని గుర్తించాలి. హీరో నాని ఈ విషయాన్ని చాలా త్వరగానే గ్రహించాడు అందుకే చాలా జాగ్రత్తగా సినిమాలు చేసుకుంటూ విజయాల బాటలో కొనసాగుతున్నాడు. స్టార్ హీరోలు కూడా తమ సినిమాలు బాగా ఆడేలా తగు జాగ్రత్తలు తీసుకుంటే ఎన్నో’సినీ’ కుటుంబాలు పచ్చగా ఉంటాయి.. మరెంతో కాలం సినీ పరిశ్రమ ‘కళకళ’లాడుతూ ఉంటుంది.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.