సిని’మా’ మీడియా.. అసలు నిజం ఏంటి..నేటి సినిమా స్పెషల్ !

సినిమా జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో ప్రచార సాధనాలుగా మీడియా ఎంతో ప్రాధాన్యతతో వ్యవహరిస్తుంది. ఎలెక్ట్రానిక్, ప్రింట్ మీడియాలుగా ఉన్నది కాస్త కాలాణుగుణంగా టెక్నాలజీలో భాగంగా సోషల్ మీడియా, డిజిటల్ మీడియా అనే అస్త్రాలు వచ్చాయి. ఎవరికి తోచినట్టుగా వారి అభిప్రాయాన్ని వ్యక్తికరించవచ్చు.. ఎలాంటి వార్త అయినా రాసేయొచ్చు.

అంతేకాదు హీరో హీరోయిన్ క్లోజ్ గా ఉంటే చాలు వారి మధ్య రిలేషన్ ఉన్నట్టుగా పుట్టించేయొచ్చు.. పొరపాటున సెలబ్రిటీస్ నోరు జారినా తప్పు చేసినా అదే హైలెట్ చేస్తూ రచ్చ చేయొచ్చు. ఇన్ని చేస్తూ ఓ సినిమా రిలీజ్ సందర్భంలో సోషల్ మీడియా చేస్తున్న నెగటివ్ పబ్లిసిటీ సినిమా పరిశ్రమ మీద దెబ్బ తీస్తుంది అన్నది అసలు టాపిక్.

ఇక విషయానికొస్తే.. మీడియా అది ఏరూపంలో ఉన్నా దానికంటూ కొన్ని పరిమితులు ఉంటాయి. చూసిందే రాస్తున్నారు అన్నది కాకున్నా జరుగుతుంది అని రూమర్ వచ్చినప్పుడే ఎలాంటి వార్త అయినా రాసేది. ఇక రివ్యూల మీద రివ్యూ రైట్స్ మీద స్టార్ దగ్గర నుండి దర్శక నిర్మాతల వివక్ష తెలిసిందే.

సినిమా చూసి రివ్యూ రాస్తున్నారా లేక చూడకుండా రాస్తున్నారా అన్నది కాదు రివ్యూ నెగటివ్ గా రాసినా హిట్ సినిమాను ఆపగలుగుతున్నారా.. రివ్యూ ల మీద ఆధారపడి చిన్న సినిమాలే ఫలితాలు నిర్ధారించకోని ఈరోజుల్లో రివ్యూల వల్ల సినిమా పరిశ్రమకు దెబ్బ పడుతుంది అని ఎలా అంటారు.?

అంతేకాదు హీరో, హీరోయిన్స్ ఇలా తమకు సంబందించిన పర్సనల్ విషయాల పట్ల కూడా సోషల్ మీడియా పరిమితులు దాటి మరి అనవసర రచ్చ చేస్తున్నారు అని మూవీ ఆర్టిస్ట్ ఆసోషియేషన్ వారు అంటున్నారు. బికినిలు వేసుకుంటూ సమాజాన్ని యువతను తప్పుదోవ పట్టిస్తున్న క్రమంలో ఎవరి గురించో ఏదో రాశారని ఎలా పర్సనల్ గా తీసుకుంటారు?

సోషల్ మీడియా.. క్షణాల్లో వార్తలను వాటి వివరాలను ప్రజలకు అందిస్తుంది. దీని వల్ల 1 టూ 2 పర్సెంట్ జరగరానివి జరుగుతున్నా సరే ప్రస్తుతం మీడియా రంగంలో సోషల్ మీడియా, డిజిటల్ మీడియా అనేది ముఖ్య భూమిక పోశిస్తుంది. మరి దాన్ని టార్గెట్ చేస్తూ చర్యలు తీసుకుంటాం అంటున్న మా అసోషియేషన్ సభ్యులు సమాజానికి ఉపయోగపడే సినిమాలు.. సింగరేట్, ఆల్కహాల్ ఇంకా మర్డర్ రేప్ సీన్ల లాంటివి కూడా సినిమాలో లేకుండా కొత్త రూల్ తెస్తే మంచిది. సినిమాను బట్టే మీడియా అంతేకాని మీడియా సినిమాను నాశనం చేస్తుంది అంటే మాత్రం అర్ధం లేనట్టే.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.