‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఆడియో వేడుకలో విష్ణు, నిఖిల్‌ల మధ్య రచ్చ

nikhil manchu vishnu funny conversation

Nikhil and Manchu Vishnu’s funny conversation at ekkadiki pothavu chinnavada audio function. Tollywood and sensational news updates Neticinema is one among the best. Experience the unique presentation of articles for the film industry latest updates and trending news.

ఆదివారం (13-11-2016) రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఆడియో సక్సెస్‌మీట్ వేడుకలో ఈ సినిమా హీరో నిఖిల్, మంచు విష్ణుల మధ్య ఓ ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. స్టేజ్‌మీదకి మాట్లాడటానికి వచ్చిన విష్ణు.. తనకు సాధారణంగా తన సినిమా ఆడియో వేడుకలకు వెళ్ళడం అంతగా ఇష్టముండదని, మరోసారి ఇతర మూవీల ఆడియో ఈవెంట్లకు పిలవొద్దంటూ నిఖిల్‌కి చెప్పాడు. ఎందుకంటే.. స్టేజ్ మీద నిలబడి జనాల ముందు మాట్లాడటం తనకు చాలా మొహమాటమని, అందుకే తన సినిమా ఆడియో ఈవెంట్లకే హాజరుకావడం ఆసక్తిగా ఉండదని, కాబట్టి ఇకపై తనని ఏ ఈవెంట్‌కి ఆహ్వానించవద్దని క్లారిటీ ఇచ్చాడు.

Read in English : Vishnu Vs Nihil

ఇప్పుడు ఈ మూవీ ఆడియో వేడుకకి రావడానికి కూడా ఓ కారణం ఉందని చెప్పాడు విష్ణు. ‘వైజాగ్‌లో మా నాన్నగారు (మోహన్‌బాబు) ‘40 ఇయర్స్’ ఫంక్షన్ చేసినప్పుడు 102 జ్వరం ఉన్నప్పటికీ నువ్వు హైదరాబాద్ నుంచి అక్కడికి వచ్చావ్.. దాని కృతజ్ఞతగా నేను వచ్చాను. ఆ కారణం అడ్డం పెట్టుకుని నీ ఇతర సినిమాల ఆడియో ఫంక్షన్లకు పిలవొద్దు’ అని అన్నాడు. అప్పుడు వెంటనే నిఖిల్ లేచి.. ‘మోహన్‌బాబు ఈవెంట్‌కి పిలవడమే నాకు ఎక్కువ.. అప్పుడు మీరు నాకిచ్చిన గౌరవం, ప్రాధాన్యత ఎప్పటికీ మరిచిపోలేను.. మీరు (మంచి విష్ణు) నా సినిమా ఆడియో ఫంక్షన్‌కి వచ్చినందుకు చాలా థ్యాంక్స్.. ఇకపై మిమ్మల్ని ఆడియో ఫంక్షన్స్‌కి పిలవను’ అని చెప్పాడు. ఇలా వీరి మధ్య జరిగిన ఫన్నీ సంభాషణ ఆ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Related posts:
బాహుబ‌లి స్టోరీకి అదే స్ఫూర్తి... జ‌క్క‌న్న చెప్పిన సీక్రెట్‌
‘ఊపిరి’ ఫస్ట్‌వీక్ కలెక్షన్స్.. తమిళంలోకంటే తెలుగులోనే ఎక్కువ!
సింగర్ సునీత చెప్పిన మరిన్ని షాకింగ్ నిజాలు.. ఆరేళ్ళ నుంచి..
‘ఇజం’ ఫస్ట్ వీకెండ్ వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్
షాకింగ్: జవాన్‌లో ఎన్టీఆర్.. రచ్చ చేసిన ఫ్యాన్స్!
‘సాహో’కి లీకేజ్ బెడద.. అందుకే దర్శకుడు ఇలా!

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.