నిఖిల్ ‘కిర్రాక్ పార్టీ’ మూవీ రివ్యూ-రేటింగ్

సినిమా : కిరాక్‌ పార్టీ
నటీనటులు : నిఖిల్‌, సంయుక్త హెగ్డే, సిమ్రన్‌, తదితరులు
దర్శకత్వం : శరణ్‌ కొప్పిశెట్టి
నిర్మాత : రామ బ్రహ్మం సుంకర
సంగీతం : అజనీశ్‌ లోకనాథ్‌
ఎడిటర్ : ఎం.ఆర్‌ వర్మ
బ్యానర్ : ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌
విడుదల తేదీ : 16-03-2018

డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన యంగ్ హీరో నిఖిల్.. ఇప్పుడు ‘కిర్రాక్ పార్టీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కన్నడలో మంచి విజయం సాధించిన ‘కిరిక్‌ పార్టీ’కి ఇది రీమేక్‌. ఆల్రెడీ హిట్టైన చిత్రం, పైగా నిఖిల్ లాంటి క్రేజీ హీరో చేయడంతో దీనిపై ముందనుంచే మంచి అంచనాలు నెలకొన్నాయి. కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ మూవీ టీజర్, ట్రైలర్లకూ మంచి స్పందనే రావడంతో.. జనాల్లో ఆసక్తి నెలకొంది. మరి.. ఆ అంచనాల్ని ఈ చిత్రం అందుకోగలిగిందా? టైటిల్‌కు తగ్గట్టే ‘కిరాక్‌’ పుట్టించిందా? రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం..

కథ :
కృష్ణ(నిఖిల్) ఒక ఇంజనీరింగ్ విద్యార్థి. అతని చుట్టే ఈ సినిమా కథ నడుస్తుంది. నాలుగేళ్ల కాలేజీ జీవితంలో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి..? ఒక సాదాసీదా స్టూడెంట్ దగ్గర నుంచి కాలేజి స్టూడెంట్స్ నాయకుడిగా ఎలా ఎదిగాడు? ఈ గ్యాప్‌లో అతని లైఫ్‌లోకొచ్చిన ఇద్దరు అమ్మాయిలు, పరీక్షలు, అతనిలో ఎలాంటి మార్పుల్ని తీసుకొచ్చాయి..? చివరికి అతని ప్రయాణం ఎటు సాగింది? అనే అంశాల చుట్టూ నడిచే కథే ‘కిర్రాక్ పార్టీ’.

విశ్లేషణ :
ఇది కాలేజీ కుర్రాళ్ళకి నచ్చే కథ అని యూనిట్ ఎప్పట్నుంచో చెప్తూ వస్తోంది. ‘హ్యాపీడేస్’ తరహాలోనే ఇది ఎంటర్టైన్ చేస్తుందని నిఖిల్ ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు. అతను చెప్పినట్లుగానే దాదాపు అదే సినిమా పోలికలతో ఈ కిర్రాక్ పార్టీ సాగుతుంది. మొత్తం కాలేజ్ లైఫ్ చుట్టే.. సరదాగా, కొంచెం ఎమోషనల్ టచ్‌తో ఫ్రెండ్‌షిప్ వ్యాల్యూ తెలియచేస్తూ సినిమాని నడిపించాడు.

ఫస్టాఫ్ విషయానికొస్తే.. దాదాపు సరదాగా సాగిపోతుంది. జూనియర్లు, సీనియర్ల మధ్య గొడవలు.. ర్యాగింగ్‌కు, ఫ్రెండ్‌షిప్‌కు సంబంధించిన సన్నివేశాలు.. హీరో-హీరోయిన్ల రొమాంటిక్ ట్రాక్స్‌తో ఎంటర్టైనింగ్‌గా గడిచిపోతుంది. మీరా (సిమ్రన్‌) ఎంట్రీతో కథ కాస్త ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. ఇంటర్వెల్‌కి ముందు వచ్చే కొన్ని సన్నివేశాల కారణంగా హీరో రెబెల్ అవతారం ఎత్తుతాడు. ఇక సెకండాఫ్ మొత్తం హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ సినిమాని నడిపించారు. యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఎక్కువ కావడంతో వినోదం తగ్గుతుంది. అక్కడక్కడ కొన్ని సీన్లు ఓవర్‌గానూ, బోరింగ్‌గానూ అనిపిస్తాయి. కథ గాడి తప్పినట్లు అనిపిస్తుంది. కానీ.. ప్రీ-క్లైమాక్స్‌కి వచ్చేసరికి కథ తిరిగి గాడిలోకి వస్తోంది. క్లైమాక్స్ హ్యాపీడేస్‌ను తలపిస్తూ ముగుస్తుంది.

మైనస్ పాయింట్ ఏంటంటే.. దర్శకుడు దాదాపు కన్నడ మాతృకనే కంటిన్యూ చేసేశాడు. ఫస్టాఫ్‌లాగా సెకండాఫ్ పెద్దగా ఎంటర్టైనింగ్‌గా లేదు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా పెద్దగా ఏమీ లేవు. వాటన్నింటినీ పక్కనపెడితే.. ఓవరాల్‌గా ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేయొచ్చు. ముఖ్యంగా.. కాలేజీ కుర్రాళ్ళకు ఇది మెప్పిస్తుంది.

నటీనటుల ప్రతిభ :
నిఖిల్ ఎప్పట్లాగే తన నటనా ప్రతిభని చాటిచెప్పాడు. రెండు డిఫరెంట్ షేడ్స్‌లో ఆకట్టుకున్నాడు. ఫస్టాఫ్‌లో చాకొలెట్‌ బాయ్‌లా, సెకండాఫ్‌లో రెబెల్‌లా అదరగొట్టేశాడు. ఎమోషనల్ సీన్లలోనూ కట్టిపడేశాడు. సంయుక్త హెగ్డే, సిమ్రన్‌ వారి పరిధిమేరకు నటించి ఆకట్టుకున్నారు. రెగ్యులర్‌ హీరోయిన్‌ పాత్రలకు భిన్నంగా వీరి క్యారెక్టర్లు వున్నాయి. స్నేహితుల బ్యాచ్‌లో దాదాపు అందరూ కొత్తవారే అయినా.. తమతమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు.

టెక్నికల్ పెర్ఫార్మెన్స్ :
సాంకేతికంగా కొత్తదనం కనిపించలేదు కానీ.. ఉన్నంతలో తమతమ ట్యాలెంట్ చాటుకోవడానికి టెక్నీషియన్స్ ప్రయత్నించారు. కెమెరావర్క్ ఓకే. పాటలు సందర్భానుకూలంగా వుండడంతో బోర్ కొట్టించవు. నేపథ్య సంగీతం అదిరిపోయింది. సెకండాఫ్‌లో ఎడిటర్ కత్తెరకు పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలకు వంక పెట్టడానికి లేదు. దర్శకుడు ఎంచుకున్న కథ రొటీన్.. స్ర్కీన్‌ప్లేలోనూ కొత్తదనం లేదు. సెకండాఫ్ సాగదీసి, కాస్త విసిగించాడు. కాకపోతే కాలేజ్ స్టూడెంట్స్‌కి నచ్చేలా మ్యానేజ్ చేయడంలో సక్సెస్ అయ్యాడు.

చివరగా : కాలేజ్ స్టూడెంట్స్‌కి ‘కిర్రాక్’ తెప్పించే ‘పార్టీ’
రేటింగ్ : 3/5

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.