చరణ్-మహేష్-బన్నీలు కాదు.. పార్టీ స్టార్ట్ చేసేది నిఖిల్!

యంగ్ హీరో నిఖిల్ ‘‘కేశవ’’ తరువాత గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా ‘కిరాక్ పార్టీ’. కన్నడంలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నప్పుడే నిఖిల్‌ను హీరోగా అనుకున్నారు దర్శకనిర్మాతలు. తొలుత ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9న రిలీజ్ చేయాలని అనుకున్నారు చిత్ర యూనిట్. కానీ కొన్ని కారణాల వల్ల చిత్రాన్ని వాయిదా వేస్తూ వచ్చారు.

ఇప్పుడు కిరాక్ పార్టీ చిత్ర రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు చిత్ర యూనిట్. వేసవిలో స్టార్ హీరోలు తమ సినిమాలతో సందడి చేయనున్న విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘రంగస్థలం’ మార్చి 30న, మహేష్ ‘భరత్ అనే నేను’ బన్నీ ‘నా పేరు సూర్య’ చిత్రాలు ఏప్రిల్ 26న రిలీజ్ కానున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని నిఖిల్ అండ్ బ్యాచ్ మార్చి 22న తమ కిరాక్ పార్టీ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. సమ్మర్ బ్యాంగ్‌ను తానే స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యాడు నిఖిల్.

ఏదేమైనా తన సినిమాను స్టార్ హీరోల సినిమాల మధ్య పోటీకి దించకుండా జాగ్రత్త పడుతూనే తన సినిమా మంచి విజయాన్ని అందుకుంటందనే నమ్మకంగా ఉన్నాడు నిఖిల్. కిరాక్ పార్టీ చిత్రాన్ని శరణ్ కొప్పిశెట్టి డైరెక్ట్ చేస్తుండగా ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ నిర్మిస్తోంది.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.