ఆ ‘సెంటిమెంట్’కి భయపడి.. తట్టాబుట్టా సర్దేసిన నిఖిల్

యంగ్ హీరో నిఖిల్‌కి కెరీర్‌లో మేజర్ బ్రేక్ ఇచ్చిన సినిమా ఏదైనా ఉందంటే.. అది ‘కార్తికేయ’నే! గుప్త నిధుల చుట్టూ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం.. ప్రశంసలు అందుకోవడంతోపాటు భారీ వసూళ్ళు కూడా కొల్లగొట్టింది. అలాగే.. నిఖిల్‌కి, దర్శకుడికి కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది.

దీంతో.. అప్పుడే ఈ చిత్రానికి సీక్వెల్ చేద్దామని ప్లాన్ చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది కుదర్లేదు. మళ్ళీ ఇన్నాళ్ళకు సీక్వెల్ తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా నిఖిల్ కూడా వెల్లడించాడు. సీక్వెల్ అంటే వేరే కథతో చిత్రం చేయమని.. ఫస్ట్ పార్ట్‌ ఎక్కడైతే ముగిసిందో అక్కడ్నుంచి స్టార్ట్ అవుతుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు కూడా! ఈ ప్రాజెక్ట్ చేసేందుకు తానెంతో ఉత్సాహంగా ఉన్నానని కూడా చెప్పుకొచ్చాడు నిఖిల్.

అలాంటిది.. ఇప్పుడు ఆ సీక్వెల్ ఆలోచనని నిఖిల్ పూర్తిగా విరమించుకున్నాడట! అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం! ఇందుకు రెండు మేజర్ కారణాలున్నాయి. ఒకటి.. స్ర్కిప్ట్ అనుకున్న విధంగా రాకపోవడం, రెండోది.. టాలీవుడ్ సెంటిమెంట్! ఒక్కసారి మన ఇండస్ట్రీ ట్రాక్ రికార్డ్ తిరగేస్తే.. ‘బాహుబలి’ తప్ప ఏ ఒక్క సీక్వెల్ విజయం సాధించిన దాఖలాలు లేవు. చిరంజీవి దగ్గర్నుంచి రవితేజ వరకు.. అందరూ సీక్వెల్స్ తీసి, చేదు అనుభవం ఎదుర్కొన్నవాళ్ళే!

అదే సెంటిమెంట్.. ‘కార్తికేయ-2’లోనూ రిపీట్ అవుతుందనే భయంతోనే నిఖిల్ ఈ ప్రాజెక్ట్ వద్దనుకున్నాడట! సీక్వెల్ అనగానే మొదటి భాగం కంటే ఎక్కువ అంచనాలు నెలకొంటాయి కాబట్టి.. అనవసరమైన రిస్క్ ఎందుకనుకుని నిఖిల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఇది నిఖిల్ ఫ్యాన్స్‌తోపాటు సినీ లవర్స్‌కి కూడా చేదువార్తే!

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.