ఆ సినిమా చేయడమే ఒక దరిద్రం – నితిన్

యంగ్ హీరో నితిన్ ఇటీవల ‘‘ఛల్ మోహన్ రంగ’’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడినప్పటికీ ప్రేక్షుకుల అంచనాలను రీచ్ కాలేకపోయింది. సినిమాకు మిక్సిడ్ టాక్ రావడంతో కలెక్షన్స్ పెద్దగా కలెక్ట్ చేయలేకపోయింది. కాగా ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ నిర్మాతగా వ్యవహరించగా త్రివిక్రమ్ కథను అందించాడు.

తాజాగా నితిన్ ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపాడు. నితిన్ కేవలం హీరోగానే కాకుండా ప్రొడ్యూసర్‌గా కూడా తన సత్తా చాటుతున్నాడు. అయితే తన సొంత బ్యానర్‌పై తీసిన ‘‘అఖిల్’’ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగలడం తనను చాలా డిజప్పాయింట్ చేసిందని నితిన్ అన్నాడు. ఈ సినిమా కథ ఎప్పుడైతే విన్నామో అదే దరిద్రం అని నితిన్ అన్నాడు. ఈ సినిమాపై తన ఫ్యామిలీ చాలా నమ్మకాలు పెట్టుకుందని కానీ సినిమా ఫెయిల్యూర్‌గా మిగలడంతో వారిముందు తలెత్తుకోలేక పోయానని చెప్పాడు నితిన్. అయితే తన భాద డబ్బుల గురించి కాదని సినిమా సక్సెస్ అవుతుందని తాను భావించానని చెప్పాడు నితిన్.

ఇలా ‘‘అఖిల్’’ చిత్రం గురించి నితిన్ ఇంకా ఫీల్ అవుతున్నాడు అంటే అతడు ఆ సినిమాపై ఎలాంటి నమ్మకాలు పెట్టుకున్నాడో ఇట్టే అర్ధం అవుతుంది. ప్రస్తుతం నితిన్ శ్రీనివాస కళ్యాణం అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాను అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు రెడీ అవుతున్నాడు నితిన్.

Related posts:
నాన్నకు ప్రేమతో రెండురోజుల కలెక్షన్స్.. ఏమాత్రం తగ్గని జోరు..
కన్ఫర్మ్ : ‘గౌతమీపుత్ర శాతకర్ణి‘ రిలీజ్ అప్పుడే
వ్యవసాయం చేస్తున్న జగ్గూ భాయ్
రికార్డ్ ధరకి ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ శాటిలైట్ రైట్స్
టీజర్ టాక్: అరుంధతి కోటలో భాగమతి రచ్చ!
అజ్ఞాతవాసి ఫస్ట్ డే వరల్డ్‌వైడ్ కలెక్షన్స్.. రికార్డులను అజ్ఞాతంలోకి నెట్టిన పవన్!

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.