మళ్లీ మళ్లీ అనుకుంటే.. మొదటికే మోసం!

యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సుధీర్ చెప్పిన ఇంట్రెస్ట్ంగ్ స్క్రిప్ట్‌తో ఫుల్ శాటిస్ఫై అయిన శర్వానంద్ ఈ సినిమాను వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని చూస్తున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్‌గా కాజల్, నిత్యా మీనన్‌లు జాయిన్ అయ్యారు. శర్వా-నిత్యా కాంబో అనగానే మనకు ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’, ‘రాజాధి రాజా’ వంటి హిట్ సినిమాలు గుర్తుకు వస్తాయి. ఇప్పుడు మూడోసారి వెండితెరపై ఈ జంట ఎలా అలరిస్తుందా అని ఆశగా ఎదురుచూశారు జనాలు. కానీ వారి ఆశలపై నీళ్లు చల్లి వెళ్లిపోయింది నిత్యా.

శర్వానంద్ సినిమా నుండి నిత్యా మీనన్ వాకౌట్ చేసింది. ఈ సినిమా కోసం ఆమెకు ఇచ్చే రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతలతో ఓ ఒప్పందానికి రాలేకపోయిందట నిత్యా. దీంతో ఆమె సినిమా నుండి వెళ్లిపోయిందట. కాగా మరో హీరోయిన్‌గా కాజల్ మాత్రం ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది. ఇక నిత్యా మీనన్ ప్లేస్‌లో వేరే హీరోయిన్ కోసం వేట మొదలెట్టారు చిత్ర యూనిట్. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ వారు ప్రొడ్యూస్ చేస్తున్నారు.

పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో శర్వానంద్ డ్యుయెల్ రోల్ చేయనున్నాడు. అతడి పర్ఫార్మెన్స్ ఈ సినిమాకే మేజర్ హైలైట్ కానుందట. అందులో ఒకటి ముసలివాడి వేషం కావడం విశేషం అని చెప్పాలి. మరి ఈ సినిమాలో సుధీర్ వర్మ ఎలాంటి కాన్సెప్ట్‌ను చూపిస్తున్నాడో చూడాలి.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.