‘జై లవకుశ’కి ఏమైంది.. ఈ దాగుడుమూతలు ఎందుకు..?

jai lava kusa collections

‘జై లవకుశ’ రిలీజైనప్పటి నుంచి తమ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోందని యూనిట్ అధికారికంగా వెల్లడిస్తూ వచ్చింది. వారానికోసారి తమ మూవీ ఎంత గ్రాస్ కలెక్ట్ చేసిందో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌వారు సోషల్ మీడియా మాధ్యమంగా అఫీషియల్ పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు.

ఇలా మూడువారాలపాటు వసూళ్ల ఫిగర్ రివీల్ చేస్తూ వచ్చిన యూనిట్.. నాలుగోవారం వచ్చేసరికి పంథా మార్చేసింది. కలెక్షన్స్ పోస్టర్ రిలీజ్ చేయకుండా కేవలం తమ మూవీ నాలుగోవారంలోకి అడుగుపెట్టిందంటూ కొన్ని పోస్టర్స్‌ని మాత్రమే విడుదల చేసింది. దీంతో.. ఇండస్ట్రీలో వీటిపై కొత్త రూమర్లు చక్కర్లు కొట్టడం మొదలయ్యాయి.

ఫస్ట్ త్రీ వీక్స్ వరకు జోష్‌గా గ్రాస్ ఫిగర్స్ చెప్పిన యూనిట్.. నాలుగోవారంలోకి వచ్చేసరికి అదే పంథాని ఎందుకు కంటిన్యూ చేయలేదు? కలెక్షన్స్ ఫిగర్‌ని ఎందుకు రివీల్ చేయలేదు? అనే ప్రశ్రలు తలెత్తడం మొదలయ్యాయి. ఈ విషయంపై ఆరాతీయగా.. కలెక్షన్లు బాగా డ్రాప్ అవ్వడం వల్లే కలెక్షన్స్ పోస్టర్‌ని రవీల్ చేయలేదని ఫిల్మ్‌నగర్‌ వార్త.

రెండువారాలపాటు బాక్సాఫీస్‌తో ఓ ఆటాడుకున్న ‘జై లవకుశ’.. మూడోవారంలో డీలా పడిపోయిందని, అందుకే నాలుగోవారంలోకి వచ్చేసరికి ఆ వివరాల్ని వెల్లడించలేదని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ఈ లెక్కన.. ఈ చిత్రం టోటల్ రన్‌కి దగ్గరపడినట్టే. మరి.. దీనిపై యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related posts:
సోగ్గాడే చిన్ని నాయ‌న డేట్లు ఫిక్స్‌
బాలయ్య గురించి మోక్షజ్ఙ చెప్పిన మాట
‘వచ్చింది కదా అవకాశం’ ఫుల్ సాంగ్.. ‘బ్రహ్మోత్సవం’ను తలపించే మధురమైన పాట
రికార్డుల వేట మొదలెట్టిన ‘ధృవ’.. అక్కడ ఆ మైలురాయి గ్యారెంటీ
‘ఎంసీఏ’ రెండురోజుల కలెక్షన్స్.. రెండోరోజూ ఉతికారేసిన నాని
నేల టిక్కెట్టు ప్రీ-రిలీజ్ బిజినెస్.. ఆ సినిమాను టచ్ చేయని రవితేజ!

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.