కలెక్షన్ల వివరాలపై చిత్రబృందాలు పెద్దగా స్పందించవు. ట్రేడ్ వర్గాలు ఎలాగూ వెల్లడిస్తాయి కాబట్టి.. యూనిట్స్ సైలెంట్‌గానే వుంటాయి. కానీ.. ఎప్పుడైతే వసూళ్ల ఫిగర్స్ మీద అభ్యంతరాలు వ్యక్తమవుతాయో, అప్పుడు కచ్ఛితంగా రెస్పాండ్ అవుతాయి. తమ చిత్రం నిజంగానే ఇంత వసూల్ చేసిందంటూ అధికారిక ప్రకనటలు విడుదల చేస్తాయి. తాజాగా ‘జై లవకుశ’ యూనిట్ కూడా అదే చేసింది.
నిజానికి.. తొలిరోజు నుంచి ఫస్ట్ వీక్ వరకు తమ మూవీ ఎంత కలెక్ట్ చేస్తూ వచ్చిందో యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఆ తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో కొన్ని ప్రచారాలు మొదలయ్యాయి. కలెక్షన్లు పడిపోవడం వల్లే యూనిట్ వెల్లడించడం లేదని కామెంట్స్ వచ్చాయి. వాటిని తిప్పికొట్టేందుకే ఇప్పుడు మళ్ళీ స్పందించింది. తమ చిత్రం ‘జై లవకుశ’ ఇప్పటివరకు రూ.76+ కోట్లు షేర్, రూ.131 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిందని అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది. దీంతో.. ఫేక్ కలెక్షన్లని విమర్శించిన వాళ్లకి గట్టి కౌంటర్ పడింది.
ఇకపోతే.. ఈ చిత్రం ఇంకో నాలుగు కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే.. ‘జనతా గ్యారేజ్’ (రూ.134.5 కోట్లు గ్రాస్) బద్దలైపోతుంది. ఇప్పటికీ ఈ చిత్రం డీసెంట్ వసూళ్లతో రన్ అవుతోంది కాబట్టి.. ఆ రికార్డ్ బద్దలవ్వడం ఖాయమని ట్రేడ్ నిపుణులు పేర్కొంటున్నారు. అదే జరిగితే.. తారక్ కెరీర్లో ‘జై లవకుశ’ బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలుస్తుంది.