అప్పుడు 70.. ఇప్పుడు 100.. సీన్ సితారే!

‘బిగ్‌బాస్’ కార్యక్రమం ఆల్రెడీ ఒక సంచలనం.. దానికి నటరుద్ర ఎన్టీఆర్‌లాంటి మరో సెన్సేషన్ జత అయితే.. దాని ఫలితం ఎలా ఉంటుందో ఇప్పటికే ‘బిగ్‌బాస్-1’ సీజన్ చాటిచెప్పింది. గతేడాది ఆ షో ద్వారా బుల్లితెరపై అడుగుపెట్టిన తారక్.. తనదైన శైలిలో హోస్టింగ్ చేసి ప్రేక్షకుల హృదయాల్ని దోచేశాడు. ఇంత సరదాగా కూడా హోస్ట్ చేయొచ్చా? అని ఇతర హోస్ట్‌ల ఫ్యూజులు ఎగిరిపోయేలా చేశాడు. నవ్వులు పూయిస్తూ.. కంటెస్టంట్లకు మంచి సూచనలిస్తూ.. అతి చేసిన వారికి గుణపాఠం నేర్పుతూ.. అప్పుడప్పుడు సెటైర్లతో కితకితలు పెడుతూ.. అబ్బో తారక్ మామూలుగా కుమ్మేయలేదు. తారక్ చేసిన హంగామా వల్లే టీఆర్‌పీ రేటింగ్స్ అదిరిపోయాయి. ఆ షో అంతలా హిట్ అవ్వడానికి తారకే కారణమని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

అయితే.. ఆ షో ముగిసిపోయినప్పటి నుంచి మళ్ళీ తారక్ బుల్లితెరపై ఎప్పుడెప్పుడు దర్శనమిస్తాడా? ‘బిగ్‌బాస్’ సీజన్ 2 ఎప్పుడు మొదలవుతుందా? అని వెయిట్ చేస్తున్నారు. మరోవైపు.. ‘మా’ టివి రేటింగ్స్ చాలావరకు తగ్గిపోయాయి. దీంతో.. సీజన్ 2ని వెంటనే స్టార్ట్ చేయాలని ఆ ఛానెల్ యాజమాన్యం పూనుకుందని సమాచారం. అంతేకాదు.. మునుపటికంటే ఎక్కువ టిఆర్‌పీలు రాబట్టేందుకు పకడ్బందీగా బ్రహ్మాండమైన ప్లాన్ చేసినట్లు తెలిసింది. సీజన్ 1 కేవలం 70 రోజులపాటే నిర్వహించారు. అన్నిరోజుల్లోనూ అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో.. ఈసారి 100రోజుల పాటు సీజన్ 2 ఉండేలా ప్లాన్ చేసిందట మా టీవీ యూనిట్. అవును.. మీరు చదువుతోంది నిజమే! అత్యధిక టీఆర్‌పీ రేటింగ్స్ రాబట్టేందుకే ఈ ప్లాన్ చేసిందని.. అందుకు కసరత్తులు కూడా ప్రారంభమయ్యాయని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమయితే.. ఇతర బుల్లితెర షోలకు సీన్ సితారే!

70 రోజుల షోనే తారక్ దుమ్ముదులిపేశాడు. తెలుగు టెలివిజన్‌ చరిత్రలోనే ఎన్నడూ లేనంత టీఆర్‌పీ రేటింగ్‌లతో రప్ఫాడించేశాడు. ఇప్పుడు 100 రోజులంటే.. తారక్ ఊరికే ఉంటాడా? మరింత చెలరేగిపోయి ఎంటర్టైన్ చేసి, టీఆర్‌పీ రేటింగ్స్‌లో సరికొత్త మార్జిన్‌లు క్రియేట్ చేయడం ఖాయం. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నాయి.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.