RRR: చరణ్‌పై తారక్ డామినేషన్..?

‘RRR’ సినిమా సెట్స్ మీదకి వెళ్లడానికి ఇంకా చాలా సమయం వుంది. దర్శకధీరుడు రాజమౌళి ఈ మూవీ గురించి ఎలాంటి వివరాలు బయటపెట్టకుండా లోలోపలే ప్రొడక్షన్ పనులు కానిచ్చేస్తున్నారు. కానీ.. ఇండస్ట్రీలో మాత్రం ఈ మూవీ గురించి రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. టైటిల్ దగ్గర నుంచి, స్టోరీలైన్, హీరోల పాత్రలు.. ఇలా ఎన్నెన్నో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్‌గా మరో సంచలన వార్త పరిశ్రమలో తెగ హల్‌చల్ చేస్తోంది.

ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తున్న వార్త ప్రకారం.. బ్రిటిష్ ఇండియా నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమాలో తారక్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా వుంటుందని, చరణ్ రోల్‌ని పూర్తిగా డామినేట్ చేసేలా అతని రోల్‌ను జక్కన్న బలంగా డిజైన్ చేవాడని టాక్! అల్లూరి సీతారామరాజు ఛాయలున్న విప్లవవీరుడి పాత్రలో తారక్ కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. ఎమోషనల్ సీన్స్‌తోపాటు వీరోచిత యాక్షన్ ఎపిసోడ్స్ ఆ పాత్ర కోసం రాసుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే.. తారక్ మరోసారి తన నటవిశ్వరూపం చూపించడం ఖాయం! మామూలు పాత్రల్నే రక్తి కట్టించగల సత్తా వున్న తారక్.. ఇక విప్లవవీరుడంటే ఏ రేంజులో పెర్ఫార్మెన్స్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

అయితే.. చరణ్ రోల్ మాత్రం ఇంత స్ట్రాంగ్‌గా వుండదని, తారక్ పాత్ర ముందు చరణ్ క్యారెక్టర్ డల్‌గా ఉంటుందంటూ గాసిప్పులు గుప్పుమంటున్నాయి. అలాగని మరీ తీసిపారేసినట్లుగా వుండదని, పీక్ స్టేజ్‌లో మాత్రం తారక్ విశ్వరూపమే ఉండనున్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే.. కొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే!

Related posts:
ఐదుగురు హీరోల‌తో దిల్ రాజు భారీ మ‌ల్టీస్టార‌ర్‌!!
కొరటాల శివకి షాకిచ్చిన ఎన్టీఆర్.. మీరూ ఆశ్చర్యపోతారు?
‘బాహుబలి-2’ స్టోరీ లీక్.. చదివితే ఫ్యూజులు క్రాక్!
‘శాతకర్ణి’ టీజర్‌పై ఎన్టీఆర్ అదిరిపోయే కామెంట్స్.. ఏమన్నాడో తెలుసా?
అర్జున్ రెడ్డి టైటిల్‌తో గీతా ఆర్ట్స్ గోవిం(దం)దా!
‘భరత్ అనే నేను’ ఇన్‌సైడ్ టాక్ : ఫస్టాఫ్ ఇలా.. సెకండాఫ్ అలా!

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.