నానిపై తారక్ ఫ్యాన్స్ ఎటాక్.. కారణం ఇదే!

ప్రతి హీరోకి తనకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ మార్క్‌తోనే తాను ప్రేక్షకుల్ని అలరించాలనుకుంటాడు. ఇతరుల్ని కాపీ కొడితే.. తన బ్రాండ్ వ్యాల్యూకి చెక్ పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి.. వీలైనంతవరకూ తన మార్క్ స్టైల్‌ని చాటుకోవడానికి ప్రయత్నిస్తాడు. సరిగ్గా నేచురల్ స్టార్ నాని కూడా ఇలాగే తన ప్రత్యేకత చాటుకుందామని ట్రై చేశాడు. కానీ.. అది కాస్త బెడిసికొట్టడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తోంది. పదండి.. ఆ వివరాలేంటో మేటర్‌లోకి వెళ్లి తెలుసుకుందాం!

బిగ్‌బాస్ ప్రెస్‌మీట్‌లో నానికి తొలిసీజన్ గురించి ఓ ప్రశ్న ఎదురవ్వగా.. తానింకా ఈ షో చూడలేదని అతను సమాధానమిచ్చాడు. పైగా.. తారక్ హోస్టింగ్ విధానం కూడా చూడలేదని, తాను అతడ్ని ఫాలో కానని కుండబద్దలుకొట్టాడు కూడా! ఇదే అతనికి పెద్ద సమస్యగా మారింది. ప్రెస్‌మీట్‌లో నాని అలా చెప్పడం తారక్ ఫ్యాన్స్‌ని బాధపెట్టింది. నిజానికి.. తొలి సీజన్‌కంటే రెండో సీజన్ చాలా డిఫరెంట్‌గా ఉంటుందని, తాను కాపీ కొట్టకూడదనే ఉద్దేశంతోనే తొలి సీజన్ చూడలేదనేది ఇక్కడ నాని అభిప్రాయం!

కానీ.. ప్రెస్‌మీట్‌లో తొలి సీజన్ గురించి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకపోగా, అసలు చూడలేదని చెప్పడం, తారక్‌ని ఫాలో అవనని నాని పేర్కొనడం తారక్ ఫ్యాన్స్ ఫీలింగ్స్‌ని బాగా దెబ్బతీసింది. నాని కావాలనే అలా అన్నాడంటూ సోషల్ మీడియాలో అతనిపై ఎటాక్ చేయడం మొదలుపెట్టారు. మరి.. ఇది పెద్ద వివాదానికి దారితీస్తుందా? లేక త్వరలోనే సద్దుమణుగుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ!

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.