లీకైన ‘జై లవ కుశ’ స్టోరీలైన్.. తారక్ నటవిశ్వరూపం

jai-lava-kusa-story-line
Tellmeboss.net

బాబీ దర్శకత్వంలో నటరుద్ర ఎన్టీఆర్ చేస్తున్న ‘జై లవ కుశ’ సినిమా సెట్స్ మీదకి వెళ్లినప్పటి నుంచే భారీ అంచనాల్ని మూటగట్టుకుంది. ఇక ఇందులో తారక్ మూడు పాత్రలు పోషిస్తున్నాడని తెలిశాక.. ఆ అంచనాలు రెట్టింపయ్యాయి. సింగిల్ క్యారెక్టర్‌లోనే ఇరగదీసేసే ఈ నటరుద్రుడు.. మూడు పాత్రల్లో నటవిశ్వరూపం చూపించడం ఖాయమని అంతా ఫిక్స్ అయిపోయారు. అలా అనుకున్నట్లుగానే తారక్ ఈ చిత్రంలో చెలరేగిపోతాడని తాజాగా లీక్ అయిన స్టోరీలైనే సాక్ష్యం. తారక్ నటించబోయే మూడు డిఫరెంట్ పాత్రల చుట్టే కథ అల్లుకుని వుంటుందని ఆ స్టోరీలైన్‌ని బట్టి అర్థం అవుతోంది.

Tellmeboss.net

ఆ స్టోరీలైన్ ప్రకారం.. ‘జై’ ఓ భయంకరమైన విలన్ కాగా ‘లవకుమార్’ బ్యాంక్ మేనేజర్‌‌‌‌‌గానూ, ‘కుశ’ ఆర్టిస్ట్‌గానూ పని చేస్తుంటారు. ఎంతో సిన్సియర్‌గా పనిచేస్తున్న బ్యాంక్ మేనేజర్ భారీ దొంగతనానికి పాల్పడడం, దాని కారణంగా అతడ్ని జైలుకి పంపించడం జరుగుతుంది. కట్ చేస్తే.. ఈ దొంగతనం జై చేసినట్లు ఒక షాకింగ్ రివిలిషన్‌లో తెలుస్తుంది. ట్విస్ట్ ఏంటంటే.. ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్న కుశపైన కూడా అనుమానం వచ్చేలా జై చేస్తాడు. ఈ రకంగా వారి ఇద్దరి పాత్రలని, విలన్ పాత్రని ఒక జై మాత్రమే పోషిస్తూ.. ప్రేక్షకులకి ఫ్యూజులు ఎగిరిపోయేలా చేస్తాడు. అసలు విషయం ఏమిటంటే.. ఇదంతా జై ఒక్కడే చేస్తున్నాడన్న విషయం చివరిదాకా రివీల్ అవ్వదు. అదెలాగో తెలియాలంటే.. సినిమా చూడాల్సిందేనని అంటున్నారు. ఇంకో షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే.. ఈ చిత్రంలో మరో విలన్ కూడా వున్నాడట. చివర్లో అతడ్ని అంతమొందించడంతోనే ఈ మూవీ ఫినిష్ అవుతుందని టాక్. చూస్తుంటే.. ఈ చిత్రంలో చాలా ట్విస్టులు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా.. తారక్ ఈ చిత్రంలో తన నటవిశ్వరూపంతో అలరించనున్నాడని చెబుతున్నారు.

ఇదిలావుండగా.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో తారక్ సరసన రాశీఖన్నా, నివేదా థామస్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవిశ్రప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని కళ్యాణ్ రామ్ తన హోమ్ ప్రొడక్షన్ హౌస్ ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఆగస్టు 11న రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.

Tellmeboss.net
Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.