తారక్ వేసిన ‘చరణ్’ బీజానికి జక్కన్న నీళ్ళు!

జస్ట్ ఒక్క అనౌన్స్‌మెంట్‌తోనే యావత్ దేశవ్యాప్తంగా భారీ క్రేజ్‌ని మూటగట్టుకుందంటే.. అది #RRR మూవీకే సాధ్యమైందని చెప్పుకోవచ్చు. ‘బాహుబలి’లాంటి మ్యాగ్నమ్ ఓపస్ తర్వాత రాజమౌళి తీస్తున్న మూవీ కావడం.. ఎన్టీఆర్, రామ్‌చరణ్ లాంటి స్టార్ హీరోలు జతకలిసి చేస్తున్న మల్టీస్టారర్ కావడంతో.. ఈ చిత్రంపై ఎనలేని అంచనాలు నెలకొన్నాయి. బహుశా ఈ కారణంగానే ఏమో.. ఈ మూవీ గురించి రోజుకో ఆసక్తికరమైన వెలుగుచూస్తోంది.

గతకొన్నాళ్ళ నుంచి ఈ స్టోరీ, ఆ కథ అంటూ ఈ చిత్రం గురించి నానా రాద్ధాంతం జరుగుతూనే ఉంది. అంతేకాదు.. తారక్, చరణ్‌ల రోల్స్ గురించి కూడా హడావుడి నెలకొంది. ఇది చాలదన్నట్లుగా తాజాగా మరో న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. తొలుత ఈ సినిమా కథని తారక్‌కి జక్కన్న వినిపించాడని.. అతని సూచన మేరకే రెండో హీరోగా చరణ్‌ని రంగంలోకి దింపారని ఆ వార్త సారాంశం! తారక్‌తో పూర్తిగా చర్చించాకే.. రెండో హీరోగా ఎవరు సెట్ అవుతారోనని తూకం వేసుకుని.. చివరికి చరణ్ అయితే బాగుంటుందని తారక్ చెప్పిడంతో అతడ్ని తీసుకున్నాడట జక్కన్న!

ఒకవిధంగా చెప్పాలంటే.. తారక్ రికమెండేషన్‌తోనే ఈ భారీ ప్రాజెక్ట్‌లో చోటు దక్కిందని టాక్! ఇందులో ఎంతవరకు నిజముందో తెలీదు కానీ.. ఇండస్ట్రీలో మాత్రం ఈ విషయం జోరుగా ప్రచారమవుతోంది. నిజానికి.. కాస్టింగ్ విషయంలో జక్కన్న కాలిక్యులేటెడ్‌గా ఉంటాడు. ఫలానా పాత్రకి ఎవరు సూట్ అవుతారో లెక్కలేసుకుని, వాళ్ళనే ఎంపిక చేసుకుంటాడు. వేరేవాళ్ళ సలహాలు అస్సలు పాటించడు. అలాంటిది.. ఈ మల్టీస్టారర్‌పై తారక్ సలహా పాటించి, చరణ్‌ని తీసుకున్నాడని వార్తలు రావడం విడ్డూరం! లెట్స్ వెయిట్ అండ్ సీ ఫర్ క్లారిటీ!

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.