ఎమ్మెల్యేకు అండగా తారక మంత్రం!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్‌లోనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. మరోవైపు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తన నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేసేందుకు రెడీ అయ్యాడు. ఈ చిత్రం కోసం తారక్ ఒక సరికొత్త గెటప్‌లో మనకు కనిపిస్తాడు. ఈ సినిమాతో టాలీవుడ్‌ రికార్డులకు తారక్ ఎసరు పెట్టాలని చూస్తున్నాడు. అంతేగాక తన అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ చిత్రాలకు ఎప్పుడూ తన మద్ధతు ఇస్తూనే ఉన్నాడు.

ప్రస్తుతం నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం MLA(మంచి లక్షణాలున్న అబ్బాయి). ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకున్న ఈ సినిమాను రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. కాగా ఈ సినిమాపై అంచనాలు పెంచేందుకు ఈ చిత్ర ఆడియో లాంఛ్‌కు ఎన్టీఆర్‌ను గెస్ట్‌గా పిలుస్తున్నాడు కళ్యాణ్ రామ్. కాజల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ఆడియోను ఈ నెల 23న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యారు. ఈ ఆడియో ఈవెంట్‌కు తారక్‌ను పిలివడంతో సినిమాపై అంచానలు క్రియేట్ చేయాలని చూస్తున్నారు చిత్ర యూనిట్. ఇటీవల ఈ అన్నదమ్ములు కలిసి ‘జై లవ కుశ’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌ను అందుకున్న విషయం తెలిసిందే.

ఇలా తారక్ పుణ్యమా అని చిత్రానిక హైప్ తీసుకొచ్చి హిట్ కొట్టాలని చూస్తున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి. ఏదేమైనా ఈ న్యూస్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

Related posts:
ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లికి రవితేజ అడ్డు!!
సమంత మాటలకు.. ఇంటర్వ్యూ మధ్యలో వెళ్లిన ఎన్టీఆర్ (వీడియో)
అసలు కలెక్షన్ల చిట్టా ఇది.. ఆ ఏరియాల్లో తిరుగులేని జెండా ఎగరేసిన ‘శాతకర్ణి’
రంగస్థలం సాక్షిగా మెగా ఫ్యాన్స్‌కు దసరా బోనస్!
మిలియన్ మార్క్‌తో దుమ్ములేపిన పవన్ హీరోయిన్
ఆక్సీజన్ ఆలస్యం వెనుక అసలు విలన్ హీరోనే!

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.