ఫ్లాష్ ఫ్లాష్ : పట్టాలెక్కకముందే డెస్టినేషన్‌కి ఎన్టీఆర్ 28వ మూవీ

ఒకప్పుడు ఒక చిత్రం సెట్స్ మీదకి వెళ్తోందంటే.. ముందుగానే అన్ని షెడ్యూల్ ఏర్పాటు చేసుకుని, ఫలానా డేట్ ఫిక్స్ చేసుకుని, ఆ టైంలోపే చిత్రీకరణ ముగించేలా పక్కా ప్లాన్ వేసుకునేవారు. అఫ్‌కోర్స్.. ప్రకటించిన తేదీనే చిత్రాల్ని రిలీజ్ చేసేవారు కూడా! కానీ.. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మార్పులొచ్చేశాయి. అసలు ఒక మూవీ ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుందో, షూటింగ్ ఎప్పుడు ముగించుకుంటుందో తెలియని అయోమయ పరిస్థితి. ఇందుకు బలమైన కారణాలు తెలీదు కానీ.. ముందుగా ప్రకటించిన తేదీలకే ఈమధ్య సినిమాలు రావట్లేదు. ఖచ్చితంగా పోస్ట్‌పోన్ అవుతూనే ఉన్నాయి.

కానీ.. తమ చిత్రం మాత్రం అలా వాయిదా పడదని, తాము ఫిక్స్ చేసుకున్న సమయానికే రిలీజ్ చేస్తామని ఎన్టీఆర్ 28వ యూనిట్ వర్గాల సమాచారం. ఏది ఏమైనా.. దసరాకే తమ మూవీని రంగంలోకి దింపేలా ఆ చిత్రబృందం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మార్చిలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి.. అక్కడి నుంచి ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా చకచకా చిత్రీకరణ కంప్లీట్ అయ్యేలా త్రివిక్రమ్ పక్కా స్కెచ్ కూడా వేసుకున్నాడట. ‘అజ్ఞాతవాసి’ ఫ్లాప్‌తో నష్టాలపాలైన నిర్మాత రాధాకృష్ణ ఈ చిత్రానికి లిమిటెడ్ బడ్జెట్టే కేటాయించడంతో.. అందుకు అనువుగా త్రివిక్రమ్ ప్లాన్ చేశాడని అంటున్నారు. పైగా.. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీయే కాబట్టి, షూటింగ్ కోసం పెద్దగా కష్టడాల్సిన అవసరం కూడా ఉండదు. కొద్దోగొప్పో యాక్షన్ సీన్లే వున్నాయని.. వాటిని సైతం తక్కువ టైంలోనే కంప్లీట్ చేసుకునేలా ప్రణాళిక రచించినట్లు టాక్ వినిపిస్తోంది.

సో.. మొత్తానికి ఈ దసరాకే తారక్, త్రివిక్రమ్ తమ చిత్రంతో రంగంలోకి దిగిపోతున్నారన్నమాట. ఈ లెక్కన.. ఇదివరకు ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి రిలీజ్ అవుతుందని వచ్చిన వార్తలన్నీ ఫేకే! అయితే.. త్రివిక్రమ్ తన సినిమాల్ని ఎప్పుడూ త్వరగా కంప్లీట్ చేయలేదు. ఖచ్చితంగా ఆలస్యం చేసే తీరుతాడు. మరి.. ఈసారి షెడ్యూల్ ప్రకారం త్వరగా కంప్లీట్ చేస్తాడా? లేక జాప్యం చేస్తాడా? వేచి చూడాల్సిందే!

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.