త్రివిక్రమ్ దెబ్బకు తారక్ ‘సైలెంట్’.. కొట్టుకుంటున్న ఫ్యాన్స్!

అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దెబ్బకు నటరుద్ర ఎన్టీఆర్ ‘సైలెంట్ మోడ్‌’లోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. తాను వారించడానికి వీలులేకుండా చేయడంతో.. తారక్ గప్‌చుప్ అవ్వాల్సి వచ్చింది. అసలేం జరిగింది? పదండి.. మేటర్‌లోకి వెళ్ళి తెలుసుకుందాం.

త్రివిక్రమ్, తారక్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం అందరికీ తెలుసు. ఈ చిత్రం ప్రారంభోత్సవం జరుపుకున్నప్పటి నుంచి దీనిపై రకరకాల పుకార్లు చక్కర్లు కొట్టాయి. వాటన్నింటినీ యూనిట్ ఖండించింది కానీ.. ఒక్క విషయంపై మాత్రం నోరు మెదపలేదు. అదే.. టైటిల్! ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ‘హారికా & హాసినీ’ బ్యానర్‌వారు ఫిల్మ్ ఛాంబర్‌లో ‘సైలెంట్ మోడ్’ టైటిల్‌ని రిజిష్టర్ చేయించిందని.. అది ఈ చిత్రానికేనని అప్పట్లో తెగ ప్రచారం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో ఊపందుకుంది.

రీసెంట్‌గా చిత్రబృందం పూజా హెగ్డే, శ్రద్ధాకపూర్‌లను హీరోయిన్లుగానూ.. సినిమాటోగ్రఫీకి పిఎస్ వినోద్‌ను, థమన్‌‌ను సంగీత దర్శకునిగానూ ఎంపిక చేసినట్లు అధికారిక ప్రకటన చేసింది. ఈ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచే మళ్ళీ టైటిల్ విషయంపై ఫిల్మ్‌నగర్‌లో హల్‌చల్ మొదలైంది. ఇప్పటికీ యూనిట్ దీన్ని ఖండించకపోవడాన్ని చూస్తుంటే.. బహుశా ‘సెలైంట్ మోడ్’ పేరునే టైటిల్‌గా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే.. అధికారిక ప్రకటన వచ్చేవరకూ వెయిట్ చేయాల్సిందే.

ఒకవేళ ఆ టైటిల్‌నే ఫిక్స్ చేస్తే మాత్రం.. అదే ఈ మూవీకి మరింత ప్రత్యేకతగా నిలవడం ఖాయం. స్టార్ కాంబోకి అలాంటి డిఫరెంట్ టైటిల్ వుండటమే స్పెషల్ ఎట్రాక్షన్. అందుకే.. కన్ఫమ్ కాకముందే అదే టైటిల్‌ని ఫిక్స్ చేస్తే బాగుంటుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఫిక్స్ చేస్తారో లేదో చూడాలి.

Related posts:
ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. ‘ఇక సెలవు’ అంటున్న పవర్‌స్టార్!
ఎన్.టి.ఆర్ నట విశ్వరూపం చూసి కంగుతిన్న టాప్ డైరెక్టర్ !!
ఎన్టీఆర్‌ని రిజెక్ట్ చేసిన మల్లూ బ్యూటీ
సెన్సేషనల్ న్యూస్ : ఆగిపోయిన ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా?
‘బాలయ్యా..?’’ అంటూ గాలి పీకేసిన శ్రీకాంత్!
‘లెక్కలు’ తేల్చి.. ఆ పాపం తారక్‌పై నెట్టేసిన మహేష్

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.