బెడిసికొట్టిన తారక్ – త్రివిక్రమ్ ప్లాన్.. తప్పెవరిది?

‘అజ్ఞాతవాసి’ పెద్ద డిజాస్టర్ అయినప్పటికీ.. త్రివిక్రమ్ బ్రాండ్ వ్యాల్యూకి పెద్ద దెబ్బైతే పడలేదు. మొదట్లో కాస్త వ్యతిరేకత ఎదురైనా.. హిట్స్, ఫ్లాప్స్ మామూలే కాబట్టి తర్వాత లైట్ తీసుకున్నారు. ఇక ఎన్టీఆర్ విషయానికొస్తే.. ఇప్పుడు అతని రేంజ్ ఏంటో అందరికీ తెలుసు! డిఫరెంట్ సినిమాలతో సినీ లవర్స్‌ని దగ్గర చేసుకున్న ఈ హీరో.. ‘బిగ్‌బాస్’తో బుల్లితెర ఆడియెన్స్ మనసుల్ని కూడా దోచుకున్నాడు.

ఇలా తమకంటూ ప్రత్యేక బ్రాండ్ ఏర్పరచుకున్న వీళ్ళిద్దరూ కలిస్తే.. ఆ అంచనాలే చాలా హై-ఉంటాయి. అందుకే.. ఈ కాంబినేషన్‌ని కుదిర్చి ‘స్టార్ మా’ ఒక ప్లాన్ రచించింది. తెలుగులో టెలికాస్ట్ చేస్తున్న ఐపీఎల్‌ ప్రచారం కోసం.. ఆ ఇద్దరితో ఒక తెలుగు యాడ్ చేయించారు. తెలుగు గొప్పదనం ఏంటో చాటిచెప్తూ.. తెలుగులో ఐపీఎల్ చూడమని ప్రకటన చేశారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తారక్ నటించిన ఈ అడ్వర్టయిజ్‌మెంట్‌లో.. తెలుగు గురించి బాగానే చెప్పారు. ఈ జనరేషన్ వాళ్ళకు బాగా ఎక్కేలా.. ట్రెండ్‌కి తగిన డైలాగులతో తెలుగుదనం ఎంత రుచిగా ఉంటుందో తారక్‌తో చెప్పించారు.

ఆ యాడ్ బాగా సక్సెస్ అవ్వడంతో.. ఖచ్చితంగా ‘స్టార్ మా’లో తెలుగు ఐపీఎల్‌కి వ్యూవర్‌షిప్ పెరుగుతుందని అంతా అనుకున్నారు. తీరా రిజల్ట్ చూస్తే.. ఫ్యూజులు ఎగిరిపోవాల్సిన పరిస్థితి! యాడ్ సక్సెస్ అయ్యింది కానీ.. వ్యూవర్స్ మాత్రం లేరు. కొద్దోగొప్పో చూస్తున్నారే తప్ప.. ఊహించిన స్థాయిలో జనాలు చూడట్లేదు. తెలుగులో కంటే ఇంగ్లీష్ కామెంటరీకే ప్రేక్షకులు పెద్ద పీట వేశారు. ఎందుకిలా జరిగిందని కారణాలు ఆరాతీస్తే.. ‘స్టార్ మా’దే పెద్ద తప్పని తేలింది.

ముందుగా స్టార్ మా వాళ్ళు క్రికెట్ టెలికాస్ట్ చేస్తున్న ఛానెల్ ‘HD’ వెర్షన్ కాదు. ఇదే.. పెద్ద మైనస్ పాయింట్! ఇతర ఛానెల్స్ హై డెఫినిషన్‌లో క్రికెట్ ప్రసారం చేస్తుంటే.. వీళ్ళు మాత్రం మామూలుగానే ప్రదర్శిస్తున్నారు. దీంతోపాటు తెలుగు కామెంటరీ కూడా ఆకర్షణీయంగా లేకపోవడంతో.. ఇంగ్లీష్ ఛానెళ్ళవైపే జనాల దృష్టి మారింది. ఈ లెక్కన.. తారక్ – త్రివిక్రమ్ ఎంతో కష్టపడి చేసిన ఆ యాడ్ ప్లాన్ కూడా బెడిసికొట్టినట్లే!

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.