ఆట్.. సిక్స్ ప్యాక్‌తో తారక్ ‘వీర’ ఎంట్రీ!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీకి సంబంధించిన ఫస్ట్‌లుక్ అండ్ టైటిల్ కోసం యావత్ టాలీవుడ్ చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తారక్ బర్త్‌డే సందర్భంగా కొద్దిసేపటి క్రితమే ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

తారక్ అదిరిపోయే సిక్స్ ప్యాక్ లుక్‌తో కత్తి పట్టుకుని నడుచుకుంటూ వస్తున్న లుక్ చూస్తుంటే ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ రావాల్సిందే. కాగా ఈ సినిమాకు ఎవ్వరూ ఊహించని విధంగా ‘‘అరవింద సమేత వీర రాఘవ’’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్. పూర్తిగా త్రివిక్రమ్ మార్క్‌ కనిపిస్తున్న ఈ టైటిల్‌లో ఆంతర్యం ఏమిటో తెలియాలంటే మాత్రం చిత్రం చూడాల్సిందే.

ఇక త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో తారక్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ ఈచిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. దసరా కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు చిత్ర యూనిట్.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.