తమన్‌కి ఘోర అవమానం.. ఇది నిజంగా దారుణం!

ఫస్ట్‌లుక్ దగ్గరనుంచి సినిమా థియేటర్లలో దిగేంతవరకు.. యూనిట్ రిలీజ్ చేసే ప్రతి పోస్టర్‌లోనూ, ప్రోమోల్లోనూ మేజర్ టెక్నీషియన్ల పేర్లు పక్కాగా వేస్తారు. సినిమా ఔట్‌పుట్ బెస్ట్‌గా రావడంలో వాళ్ళ పాత్ర కూడా చాలా కీలకమే కాబట్టి.. ఆ మర్యాద కోసం పేర్లు తప్పకుండా వేయడం ఆనవాయితీ అయిపోయింది. కానీ.. దీన్ని ఫస్ట్ టైమ్ ‘ఎన్టీఆర్28’ చిత్రబృందం బ్రేక్ చేసింది.

ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ‘హారికా & హాసినీ’ క్రియేషన్స్ సంస్థ రిలీజ్ చేసిన ‘అరవింద సమేత వీర రాఘవ’ ఫస్ట్‌లుక్ పోస్టర్ మీదగానీ.. మోషన్ పోస్టర్ వీడియోలోగానీ ఏ ఒక్క టెక్నీషియన్ పేర్లూ వేయలేదు. కేవలం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత రాధాకృష్ణ పేర్లు మాత్రమే వేశారు. ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో వేయకపోతే ఫర్వాలేదు కానీ.. కనీసం మోషన్ పోస్టర్‌లో కూడా వేయకపోవడం మరింత విడ్డూరం! ఇతర టెక్నీషిన్ల సంగతి పక్కనపెట్టినా.. ఎట్‌లీస్ట్ సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ పేరైనా వేయాల్సింది!

ఎందుకంటే.. ఆ మోషన్ పోస్టర్‌కి తగ్గట్టుగా తమన్ కూల్ అండ్ బ్రీజ్ అనిపించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చక్కగా అందించాడు. ఆ పోస్టర్‌లో ఉన్న రొమాంటిక్ మూడ్‌లోకి తీసుకెళ్లేలా తమన్ తన మ్యాజిక్ చాటాడు. పైగా.. కెరీర్‌లో ఎన్నో భారీ సినిమాలు చేసినా, ఈ చిత్రాన్ని తమన్ ఎంతో ప్రత్యేకంగా భావించి మరీ పనిచేస్తున్నాడు. అలాంటి తమన్‌ని ఇలా ఇగ్నోర్ చేయడం నిజంగా అవమానకరమే! యూనిట్ ఇలా ఎందుకు చేసిందో తెలీదు కానీ.. త్రివిక్రమ్ కూడా దీన్ని సీరియస్‌గా తీసుకోకపోవడం మరీ విచిత్రం!

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.