‘ఎన్టీఆర్28’ దెబ్బకు ‘ఓవర్సీస్’ సీన్ సితార్

ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ కోసం ఎప్పట్నుంచో జనాలు ఎదురుచూస్తూ వస్తున్నారు. త్రివిక్రమ్ రాతకి తారక్ ప్రతిభ తోడైతే.. ఆ కాంబోనే చాలా క్రేజీగా వుంటుందని, అందుకే ఈ జంట ఎప్పుడెప్పుడు జత కడుతుందా? అని వెయిట్ చేస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఆ సమయం అయితే వచ్చింది కానీ.. కుదిరిన టైమింగే ఎవ్వరికీ నచ్చలేదు. ‘అజ్ఞాతవాసి’ డిజాస్టర్ కావడంతో త్రివిక్రమ్ ఇమేజ్ బాగా డ్యామేజ్ అవ్వడంతో.. గతంలో ఉన్నంత క్రేజ్ ఈ కాంబో మీద ఇప్పుడు లేదు. తన కెరీర్‌లోనే దారుణమైన సినిమా తీసినందుకు.. ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ఏమవుతుందా? అని అందరూ ఆందోళనలో ఉన్నారు.

ఇలా జనాలందరూ ఈ ప్రాజెక్ట్ గురించి చింతిస్తుంటే.. దాన్ని క్షణాల్లో మటుమాయం చేసే అదిరిపోయే న్యూస్ ఒకటి వెలుగులోకి వచ్చింది. జనాల్లో ఉన్న భయం కంటే రెట్టింపు బజ్ ఈ మూవీకి ట్రేడ్ వర్గాల్లో ఉంది. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యమే.. లేటెస్ట్‌గా జరిగిన బిజినెస్ రిపోర్ట్! ట్రేడ్ వర్గాల రిపోర్ట్ ప్రకారం.. ఈ సినిమా ఓవర్సీస్ హక్కుల్ని నిర్మాత రాధాకృష్ణ రూ.12 కోట్లకు అమ్మినట్లు తెలిసింది. అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం! కనీసం ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ కానీ ఈ మూవీ హక్కులు ఆ మొత్తానికి అమ్ముడుపోవడం నిజంగా విశేషం! దీన్నిబట్టి.. ఈ చిత్రంపై ‘అజ్ఞాతవాసి’ ప్రభావం ఏమాత్రం లేదని స్పష్టమైంది.

కేవలం ఓవర్సీస్ హక్కులే ఆ రేంజుకి అమ్ముడుపోయాయంటే.. తారక్‌కి విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రైట్స్‌కి ఏ రేంజులో డిమాండ్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సో.. ఈ క్రేజీ కాంబోలో వస్తున్న చిత్రం గురించి పెద్దగా దిగులు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నమాట!

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.