ఆఫీసర్ మూవీ రివ్యూ, రేటింగ్ & అనాలసిస్

చిత్రం: ఆఫీసర్
దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ
మ్యూజిక్: రవి శంకర్
సినిమాటోగ్రఫీ: భరత్ వ్యాస్
నటీనటులు: అక్కినేని నాగార్జు, మైరా సరీన్

అక్కినేని నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ ఆఫీసర్ నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. వివాదాలకు కేరాఫ్‌గా నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో ఆఫీసర్‌పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు వీరిద్దరు కలిసి గతంలో శివ లాంటి ట్రెండ్ సెట్టర్ సినిమాను అందించడం కూడా ఆఫీసర్ చిత్రంపై అంచనాలు ఏర్పడలే చేసింది. మరి నేడు రిలీజ్ అయిన ఆఫీసర్ ఈ అంచనాలు అందుకుందో లేదో చూద్దాం.

కథ:
పోలీస్ ఆఫీసర్‌గా పనిచేసే నారాయణ పసారి ఒక ఎన్‌కౌంటర్‌లో ముగ్గురిని చంపేస్తాడు. అయితే ఇది ఫేక్ ఎన్‌కౌంటర్ అని తెలిసిన డిపార్ట్‌మెంట్ ఈ కేసును ఐపీఎస్ ఆఫీసర్ శివాజి రావు(నాగార్జున)కు అప్పగిస్తుంది. నారాయణ చేసింది ఫేక్ ఎన్‌కౌంట్ అని తేల్చిన శివాజి అతడిని జైలుకు పంపిస్తాడు. కట్ చేస్తే.. జైలు నుండి బయటకు వచ్చిన నారాయణ శివాజి జీవితంలో కొన్ని ప్రాబ్లెమ్స్ క్రియేట్ చేస్తాడు. నారాయణ శివాజి జీవితంలో ఎలాంటి ప్రాబ్లెమ్స్ క్రియేట్ చేస్తాడు..? వాటిని శివాజి ఎలా ఎదుర్కొంటాడు..? నారాయణ వ్యూహాలకు శివాజి ఎలా చెక్ పెడతాడు..? అనేది ఈ చిత్ర అసలు కథ.

విశ్లేషణ:
రొటీన్ మాఫియా కథలతో విసుగెత్తించిన రామ్ గోపాల్ వర్మ, ఈసారి చాలా డిఫరెంట్ స్టోరీతో వచ్చాడు. నాగార్జున లాంటి స్టార్ హీరోకు పర్ఫెక్ట్‌గా సరిపోయే కథతో వర్మ ఈ సారి ఆకట్టుకున్నాడు. ఇంటెన్స్ కాప్ డ్రామాతో ఆఫీసర్ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యిందని చెప్పాలి. నారాయణ లాంటి ఆఫీసర్‌ నిజస్వరూపాన్ని బయటపెట్టేందుకు శివాజి చేసే ప్రయత్నాలు మనకు ఫస్టాఫ్‌లో బాగా చూపించాడు వర్మ. ఈ క్రమంలో శివాజి వేసే ఎత్తులు సగటు ప్రేక్షకుడిని బాగా ఆకట్టుకుంటాయి. నారాయణను జైలుకు పంపించిన తరువాత శివాజి తన జీవితాన్ని ఎలా లీడ్ చేస్తాడు అని చూపిస్తూనే అదిరిపోయే ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చాడు వర్మ.

సెకండాఫ్‌లో శివాజిపై పగపెంచుకున్న నారాయణ ఎలాంటి ప్రాబ్లెమ్స్ క్రియేట్ చేస్తాడో మనకు చూపించాడు వర్మ. నారాయణ బారినుండి తన కూతురుని శివాజి ఎలా రక్షించుకుంటాడు అనేది సెకండాఫ్‌లో చూపించాడు డైరెక్టర్. ఇక అదిరిపోయే క్లైమాక్స్‌తో వర్మ సినిమాకు పర్ఫెక్ట్ ది ఎండ్ కార్డ్ ఇచ్చాడు. మొత్తానికి చూస్తే వర్మ తన పాత తప్పులను ఈ సినిమాలో రిపీట్ కాకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. నాగ్-వర్మ కాంబో నుండి మరోసారి ఆకట్టుకునే చిత్రం రావడంతో అక్కినేని ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు.

నటీనటులు పర్ఫార్మెన్స్:
ఇంటెన్స్ కాప్‌గా నాగార్జున పర్ఫార్మెన్స్ చిత్రానికి మేజర్ అసెట్ అని చెప్పాలి. పర్ఫెక్ట్ పోలీస్ అంటే ఇలా ఉండాలి అనేలా నాగ్ చెలరేగి నటించి ఈ సినిమాను ఒంటిచేత్తో లాకొచ్చాడు. హీరోయిన్‌గా నటించిన మైరా సరీన్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. విలన్ నారాయణ పాత్ర సినిమాకు బాగా ప్లస్ పాయింట్ అయ్యింది. ఇక నాగ్ కూతురిగా చేసిన పాప ప్రేక్షకులను ఆకట్టుకంది. మిగతా నటీనటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
ఆఫీసర్ చిత్రంతో వర్మ మరోసారి తన సత్తా ఏమిటో చూపించాడు. తనదైన రొటీన్ కథనంతో కాకుండా కాస్త డిఫరెంట్‌గా ట్రై చేసి పోలీస్ స్టోరీతో ప్రేక్షకులను మెప్పించాడు. టేకింగ్ విషయంలో వర్మ తోపు అని ఎందుకంటారో ఈ సినిమా చూస్తే మరోసారి తెలుస్తోంది. భరత్ వ్యాస్ అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకు బాగా కలిసొచ్చింది. ప్రతీ ఫ్రేమ్‌ను గ్రాండ్‌గా చూపించాడు. రవి శంకర్ అందించిన మ్యూజిక్ బాగుంది. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సూపర్. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

చివరిగా:
ఆఫీసర్ – వర్మ నిజంగానే మెప్పించాడు!

నేటిసినిమా రేటింగ్: 2.75/5

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.