క్లోజింగ్ కలెక్షన్స్.. దుకాణం మూసేసిన ఆఫీసర్!

అక్కినేని నాగార్జన హీరోగా సెన్సేనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘ఆఫీసర్’ ఇటీవల రిలీజ్ అయిన విషయం తెలిసిందే. శివ వంటి ఇండస్ట్రీ హిట్ అందించిన ఈ కాంబో మరోసారి అలాంటి హిట్‌ను అందిస్తుందని ఆశించారు అందరు. కానీ వారీ ఆశలపై నీళ్లు చల్లాడు రామ్ గోపాల్ వర్మ.

సినిమా మొత్తంలో ఎక్కడా ఆకట్టుకునే అంశం లేకపోవడంతో ఆఫీసర్ చిత్రానికి మొదటిరోజే దండం పెట్టేశారు జనాలు. దీంతో ఈ సినిమాను కనీసం చూద్దాం అనే సాహసం కూడా చేయలేదు మిగతావారు. ఇక ఈ సినిమా కలెక్షన్లు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నాగ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా ఆఫీసర్ చిత్రం నిలిచింది. ఈ చిత్రాన్ని వారంలోపే సినిమా థియేటర్ల నుండి ఎత్తేశారు అంటే ఈ సినిమా ఎంత దారణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమా వరల్డ్‌వైడ్ క్లోజింగ్ కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.

ఏరియా – క్లోజింగ్ కలెక్షన్స్
నైజాం – 11 లక్షలు
సీడెడ్ – 17 లక్షలు
ఉత్తరాంధ్ర – 14 లక్షలు
గుంటూరు – 8 లక్షలు
ఈస్ట్ – 4 లక్షలు
వెస్ట్ – 4 లక్షలు
కృష్ణా – 13 లక్షలు
నెల్లూరు – 4 లక్షలు
టోటల్ ఏపీ+తెలంగాణ – 0.75 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 0.10 కోట్లు
ఓవర్సీస్ – 0.15 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ – 1 కోట్లు

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.