నిహారిక, నాగశౌర్యల ‘ఒక మనసు’ పోస్ట్ మార్టమ్ రిపోర్ట్

Oka Manasu Post Mortem Report

ఒక మనసు.. రిలీజ్ కాకముందు ఈ సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి. ఈ మూవీ ద్వారా మెగాఫ్యామిలీ నుంచి తొలిసారి ఓ హీరోయిన్ వెండితెరకు పరిచయం అవుతుండడంతో సహజంగానే దీనికి క్రేజ్ వచ్చిపడింది. అందుకు తోడుగా.. లవర్‌బాయ్ నాగశౌర్య ఇమేజ్ కూడా ప్రత్యేక అసెట్‌గా నిలిచింది. ఇక ‘మల్లెలతీరంలో మల్లెపువ్వు’లాంటి ఫీల్ గుడ్ మూవీకి తెరకెక్కించిన రామారాజు దర్శకత్వం ‘ఒక మనసు’ రూపొందడంతో ఈ చిత్రానికి మరింత క్రేజ్ తోడయ్యింది. ఈ కారణంగా.. ఇది బాగానే ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. దీంతో.. ఈ సినిమా రూ.15 కోట్ల క్లబ్‌లో చేరుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. మొత్తానికి.. ఈ మూవీపై విపరీతమైన పాజిటివ్ బజ్ మాత్రం ఏర్పడింది.

కానీ.. రిలీజయ్యాక మూవీ రిజల్ట్ చూసి అందరి ఫ్యూజులు ఎగిరిపోయాయి. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందనుకుంటే.. బోల్తాపడి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు అతిపెద్ద డిజాస్టర్ సినిమాల్లో ఇది కూడా ఒకటిగా నిలిచింది. ఇంత దారుణంగా ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కొన్ని కారణాలున్నాయి.

అందులో మొదటిది కథనం.. ఇది ప్రేక్షకుల సహనానికి పెద్ద పరీక్షే పెట్టింది. స్లోగా సాగే నెరేషన్ ఆడియెన్స్‌ని ఎంతలా బోర్ కొట్టించేసిందంటే.. కొందరు సినిమా చూస్తూ నిద్రపోతే, మరికొందరు ఓపిక నశించి థియేటర్లు వదిలేసి బయటికి వెళ్ళిపోయారు.
కథ కూడా పెద్దగా ఏమీ లేదు. రాజకీయాల్లో ఎదగాలని ప్రయత్నిస్తున్న హీరో, హీరోయిన్ల మధ్య సాగే లవ్ స్టోరీయే ఈ సినిమా. ఫస్టాఫ్‌లో వీరిద్దరూ అనుకోకుండా ప్రేమలో పడడం, ప్రేమించుకున్న తర్వాత అనుమానాల నడుమ విడిపోతుండడం, మళ్ళీ కలుస్తుండడం లాంటి ఎపిసోడ్లతోనే సినిమా సాగిపోతుంది. కలవడం, విడిపోవడం.. చాలాసార్లు రిపీట్ కావడంతో అక్కడే ఆడియెన్స్ బోర్‌గా ఫీల్ అవుతారు. వాటిలో కొత్తదనమంటూ ఏమీ ఉండదు. ఇక ఇంటర్వెల్ తర్వాత ఒకే ఒక్క ట్విస్ట్ ఉంటుంది. అంతే.. మళ్ళీ ఎండింగ్ దాకా వీరి లవ్ స్టోరీయే సాగుతుంది. ట్విస్టులకు అలవాటు పడ్డ జనాలు దీనిని జీర్ణించుకోలేకపోయారు.
మరో బోరింగ్ అంశం ఏమిటంటే.. హీరో, హీరోయిన్లు కలిసిన ప్రతీసారి కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం ప్రేక్షకుల్ని ఇరిటేట్ చేసేస్తాయి. ఈ సీన్లతోనే సినిమాని లాగించేశారనే ఫీలింగ్ తప్పకుండా కలుగుతుంది. మధ్యమధ్యలో కొన్ని డైలాగ్స్ పీక్స్‌లో పేలాయి కానీ.. అవి ఈ చిత్రానికి ఏమాత్రం హెల్ప్ చేయలేకపోయాయి. ఇక కమర్షియల్ సినిమాల్లో ఉండాల్సిన కామెడీ, థ్రిల్లింగ్, ఎమోషన్స్ వంటి ఎలిమెంట్స్ ఏ ఒక్కటీ ఇందులో లేవు.
మొత్తంగా చెప్పుకోవాలంటే.. మొదట 10 నిముషాలు, చివర్లో ఎమోషనల్ క్లైమాక్స్ తప్ప.. మిగతాదంతా రొడ్డకొట్టుడే. అందుకే.. ఈ సినిమా దారుణంగా ఫ్లాప్ అయ్యింది.

Related posts:
శంక‌ర్ శంక‌రే...కేరాఫ్ వండ‌ర్స్
ఎన్టీఆర్ ముందు బిగ్ స‌వాల్‌
ఈ హెల్దీ వెజిటెబుల్స్‌తో కొలెస్టిరాల్ తగ్గించుకోండి.. ఆరోగ్యంగా ఉండండి..
భావోద్వేగంతో తండ్రికి లేఖ రాసిన సుకుమార్..
నమ్మిన మహేష్ ను నట్టేట ముంచుతున్న దర్శకులు..!
కొత్త సినిమాలకు కోట్లు కుమ్మరించాడు..రొటీన్ రొట్ట సినిమాలను నిలబెట్టి నరికేశాడు

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.