నాగశౌర్య, నిహారికల ‘ఒక మనసు’ మూవీ రివ్యూ, రేటింగ్ & అనాలసిస్

Oka Manasu Review

సినిమా : ఒక మనసు
నటీనటులు : నాగశౌర్య, నిహారిక, రావు రమేష్, తదితరులు
దర్శకత్వం : రామ రాజు
నిర్మాత : మధుర శ్రీధర్
సంగీతం : సునీల్ కశ్యప్
విడుదల తేదీ : 24-06-2016

నాగశౌర్య, నిహారిక జంటగా రామరాజు దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఒక మనసు’. మొదటిసారి హీరోయిన్‌గా నిహారిక పరిచయమవుతూ చేసిన సినిమా కావడంతో దీనిపై మొదటి నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. మరి.. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఆ అంచనాలకు తగ్గట్టుగానే మంచి విజయం సాధించిందా? లేదా? రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం..

కథ :
తన తండ్రి కోరిక మేరకు ఓ మంచి రాజకీయ నాయకుడిగా ఎదగాలని సూర్య (నాగశౌర్య) కోరుకుంటాడు. ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తాడు. ఈ క్రమంలోనే అతడికి సంధ్య (నిహారిక) అనే ఓ హౌస్ సర్జన్ చదివే అమ్మాయి పరిచయం అవుతుంది. అది కాస్త స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారుతుంది. ఒకరినొకరు వదులుకోలేనంతగా ప్రేమించుకుంటారు. ఇలా సాఫీగా సాగుతుండగా.. సూర్య జీవితంలో అనుకోని మార్పులు వస్తాయి.

ఒక తప్పు వల్ల అతడు జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. దాంతో.. అతని రాజకీయ జీవితం కూడా అయోమయంలో పడిపోతుంది. ఈ సమయంలోనే సూర్య, సంధ్యల మధ్య దూరం పెరుగుతూ వస్తుంది. ఇంతకి సూర్య చేసిన ఆ తప్పేంటి? అతని జీవితంలో వచ్చిన ఈ మార్పులు ఏంటి? సాఫీగా సాగుతున్న అతని ప్రేమకథను ఆ మార్పులు ఎలా మలుపులు తిప్పాయి? సూర్య-సంధ్య ఈ పరిస్థితులకు ఎలాంటి సమాధానం ఇచ్చారు? అన్న అంశాలతో సినిమా సాగుతుంది.

విశ్లేషణ :
చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీతో స్టార్ట్ అయ్యే ఈ సినిమా ఎలాంటి వల్గారిటీ లేకుండా సింపుల్‌గా సాగిపోతుంది. ప్రేమబంధం, అనుబంధాల విలువలను బాగానే తెలియజేశారు. ఎక్కడా అతికి పోకుండా.. కవితాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశారు. సూర్య, సంధ్యల మధ్య సాగే రొమాంటిక్ ట్రాక్ అందరినీ కట్టిపడేస్తుంది. ముఖ్యంగా వారి మధ్య కెమిస్ట్రీ బాగుంది. ఇక సందర్భానుకూలంగా వచ్చే పాటలు బాగానే ఉన్నాయి. ఓ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్‌తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. అయితే.. కథనం మరీ స్లోగా సాగడంతో ఆడియెన్స్ చాలా బోర్‌గా ఫీల్ అవుతారు. మధ్యలో కొన్ని సన్నివేశాలు అనవసరంగా చేర్చినట్లు అనిపిస్తుంది.

ఇక సెకండాఫ్‌ గురించి మాట్లాడుకుంటే.. చాలావరకు ఎమోషనల్‌గా సాగిపోతుంది. సూర్య జీవితంలో వచ్చే మార్పులు.. పీకల్లోతు ప్రేమలో ఉన్న సూర్య, సంధ్యల మధ్య దూరం పెరుగుతూ రావడం, వీరి విషయంలో కుటుంబసభ్యులు ఆందోళన చెందడం.. లాంటి అంశాలతో సాగుతుంది. పరిస్థితులను బట్టి ఇద్దరు వేరడం, అంతలోనే మళ్లీ రెండు మాటలు చెప్పుకొని ఒక్కటవడం అనే కాన్సెప్ట్ బాగుంది కానీ.. అందులో కన్ఫ్యూజన్ కూడా ఉంది. ప్రీ-క్లైమాక్స్ వరకు సినిమా ఇలాగే కొనసాగుతుంది. ఆ తర్వాత ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. ఒక్కో సమస్య తీరుతూ వస్తాయి. ఇక క్లైమాక్స్ చాలా ఎమోషనల్‌గా ముగుస్తుంది.

ఓవరాల్‌గా మాట్లాడుకుంటే.. హీరో-హీరోయిన్లు మధ్య సాగే లవ్ ట్రాక్, ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్, నాగశౌర్య రాజకీయ జీవితం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు హైలైట్స్‌గా చెప్పుకోవచ్చు. పతాక సన్నివేశాలు హృద్యంగా అనిపిస్తాయి. అయితే.. ఒకేలాంటి సన్నివేశాలు మళ్ళీ మళ్ళీ రావడం వల్ల కథ చాలా నెమ్మదిగా సాగుతుంది. దీంతో.. ఆడియెన్స్ చాలా బోర్‌గా ఫీల్ అవుతారు. అలాగే.. సినిమా అంతా 1980,90ల దశకంలోని ప్రేమకథలా సాగుతుంటుంది. క్లైమాక్స్ అంతగా ఆకట్టుకోలేదు. కామెడీ లేకపోవడం పెద్ద మైనస్ పాయింట్.

నటీనటుల పెర్ఫార్మెన్స్ :
ముందుగా హీరో నాగశౌర్య గురించి మాట్లాడుకుంటే.. గత సినిమాలతో పోల్చుకుంటే ఇందులో చాలా అద్భుతంగా నటించాడు. ఆ పాత్రలోని ఎమోషన్‌ను అతను క్యారీ చేసిన విధానం అమోఘం. ముఖ్యంగా.. ఎమోషనల్ సన్నివేశాల్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక నిహారిక కూడా మొదటి సినిమాతోనే తన ప్రెజెన్స్ ఏంటో చూపించింది. కొన్ని సన్నివేశాల్లో, ఆమె చూపించిన ఎక్స్‌ప్రెషన్స్‌ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్‌లో నిహారిక చూపిన ప్రతిభను మెచ్చుకోవాల్సిందే. రావు రమేష్ ఎప్పట్లానే తన పాత్రలో ఒదిగిపోయి బాగా నటించారు. అవసరాల శ్రీనివాస్ ఓ మంచి పాత్రలో కనిపించి బాగానే మెప్పించాడు. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి ఓకే అనిపించారు.

టెక్నికల్ పెర్ఫార్మెన్స్ :
సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కథకు తగ్గట్లు కలర్ గ్రేడింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతీ ఫ్రేమ్‌ని చాలా గ్రాండ్‌గా చూపించారు. సునీల్ కశ్యప్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఎడిటింగ్ ఫర్వాలేదు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. ఇక దర్శక, రచయిత రామ రాజు గురించి మాట్లాడుకుంటే.. కెరీర్, ప్రేమ రెండూ వదులుకోలేని ఒక ప్రేమజంట పడే మథనం ఏంటీ? అన్న ఆలోచనతో ఓ కథ చెప్పాలన్న ఆయన ఆలోచన బాగుంది కానీ.. దాన్ని అందరికీ అర్థమయ్యేలా మెప్పించలేకపోయాడు. మేకింగ్ పరంగా రామ రాజు కొన్నిచోట్ల మెప్పించాడు. కొన్ని చోట్ల రామరాజు దర్శకుడిగా చూపిన ప్రతిభ చూపించాడు.

ప్లస్ పాయింట్స్ :
* నాగశౌర్య, నిహారిక
* సినిమాటోగ్రఫీ
* మాటలు

మైనస్ పాయింట్స్ :
* స్లోగా సాగే స్టోరీ
* కామెడీ లేకపోవడం

చివరగా : ఒక మనసు.. సహనానికి పరీక్ష
‘ఒక మనసు’ మూవీ రేటింగ్ : 2.5/5

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.