అల్లుశిరీష్, సురభిల ‘ఒక్క క్షణం’ రివ్యూ-రేటింగ్

okka-kshanam-review-rating

సినిమా : ఒక్క క్షణం
నటీనటులు : అల్లు శిరీష్, సురభి, అవసరాల శ్రీనివాస్, సీరత్ కపూర్, తదితరులు
కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం : విఐ ఆనంద్
నిర్మాత : చక్రి చిగురుపాటి
సంగీతం : మణిశర్మ
సినిమాటోగ్రపీ : శ్యామ్ కె.నాయుడు
ఎడిటర్ : ఛోటా కె.ప్రసాద్
బ్యానర్ : లక్ష్మీ నరసింహా ఎంటర్టైన్‌మెంట్స్
విడుదల తేదీ : 28-12-2017

హీరోగా నిలదొక్కుకునేందుకు కెరీర్ ప్రారంభం నుంచి అల్లుశిరీష్ చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. ‘శ్రీరస్తు శుభమస్తు’ కాస్త ఫర్వాలేదనిపించినా.. శిరీష్‌కి మాత్రం మార్కులు తెచ్చిపెట్టలేదు. ఇప్పుడు ‘ఒక్క క్షణం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు అల్లువారబ్బాయి. ‘ఎక్కడిపోతావు చిన్నవాడా’ లాంటి హర్రర్ థ్రిల్లర్ను రూపొందించిన విఐ ఆనంద్ దర్శకత్వంలో ‘ఒక్క క్షణ’ రూపొందడంతో.. దీనిపై మంచి అంచనాలే నెలకొన్నాయి. పైగా.. టీజర్, ట్రైలర్స్‌లో చూపించిన ‘పార్లర్ లైఫ్’ కాన్సెప్ట్‌ ఆకట్టుకోవడంతో ఈ చిత్రానికి మరింత క్రేజ్ వచ్చింది. మరి.. ఆ అంచనాల్ని అందుకోవడంలో ఈ చిత్రం సక్సెస్ అయ్యిందా? లేదా? రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం పదండి.

కథ :
నిరుద్యోగి అయిన జీవా (అల్లుశిరీష్) తన పేరెంట్స్‌తో హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేస్తుంటాడు. ఒకరోజు ఓ షాపింగ్ మాల్‌లో జీవాకి జ్యోత్స్న(సురభి) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. తొలిచూపులోనే ప్రేమలోపడ్డ ఆ ఇద్దరూ.. ఆ తర్వాత మరింత దగ్గరవుతారు. వారి ప్రేమను ఇద్దరి కుటుంబ సభ్యులు అంగీకరిస్తారు.

కట్ చేస్తే.. జ్యోత్స్య ఉండే అపార్ట్‌మెంట్‌లో శ్రీనివాస్ (అవసరాల శ్రీనివాస్), స్వాతి (సీరత్ కపూర్)ల జంట షిఫ్ట్ అవుతుంది. ఆ ప్రేమజంటపై అనుమానం కలగడంతో.. వారి గురించి జ్యోత్స్య ఆరాతీస్తుంది. అప్పుడు వాళ్ల గురించి ఆమెకి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వారి జీవితంలో జరిగిన సంఘటనలే తమ లైఫ్‌లో జరుగుతున్నాయని, దీన్ని ప్యార్లల్ లైఫ్ అంటారని జ్యోత్స్య గ్రహిస్తుంది. దానివల్ల తన ప్రేమకి కూడా ముప్పుందని తెలుసుకుంటుంది. దీంతో ఆమె జీవాని దూరంగా ఉంచుతుంది.

అసలు ఆ ప్రమాదం ఏంటి? ఆ ప్రమాదాన్ని జీవ ఎలా ఎదుర్కున్నాడు? ఇంతకీ ఈ రెండు ప్రేమజంటల జీవితాలు ఒకేలా ఎలా నడుస్తుంటాయి? వారికి, వీరికి ఉన్న సంబంధం ఏంటి? విధి ఆడిన పార్లర్ లైఫ్ నాటకంలో ఈ ప్రేమ జంటలు ఏమయ్యారు? అనే అంశాలతో ఈ సినిమా సాగుతుంది.

విశ్లేషణ :
ఫస్టాఫ్ గురించి మాట్లాడితే.. మొదట్లో కాసేపు సినిమా కథ రొటీన్‌గా సాగుతుంది. తొలుత హీరో, అతని ఫ్యామిలీ ఇంట్రొడక్షన్.. అనంతరం హీరోయిన్‌తో హీరో ప్రేమాయణం సాదాసీదాగా కొనసాగుతాయి. మరో ప్రేమజంట వచ్చాక సినిమా వేగం పుంజుకుంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠతో కథనం నడుస్తుంది. ఇక ఇంటర్వెల్ వద్ద వచ్చే ట్విస్ట్‌కి దిమ్మతిరిగిపోవాల్సిందే. అది సెకండాఫ్‌పై మరింత క్యూరియాసిటీ పెంచింది. ఆ అంచనాలకి తగినట్లే దర్శకుడు సెకండాఫ్‌ని థ్రిల్లింగ్‌గా నడిపించాడు. వెలుగుచూసే ట్విస్టులు, వాటి చుట్టూ వచ్చే ఎపిసోడ్స్, హీరో వాటిని ఒక్కొక్కటిగా రివీల్ చేయడం.. ఇలా ఎంతో ఆసక్తిగా సినిమా నడుస్తుంది. అయితే.. ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ కాస్త నెమ్మదించినట్లు అనిపిస్తాయి.

తన ప్రతి సినిమాను డిఫరెంట్ స్టోరీలైన్‌తో తెరకెక్కించే వీఐ ఆనంద్.. ఈసారి ‘ప్యార్లల్ లైఫ్’ అనే కాన్సెప్ట్‌తో ‘ఒక్క క్షణం’ సినిమా చాలా చక్కగా రూపొందించాడు. ఇద్దరు వ్యక్తుల జీవితాల్లో వేర్వేరు సమయాల్లో జరిగే ఒకే విధమైన సంఘటనల కాన్సెప్ట్‌ని ఎలా కన్ఫ్యూజన్ లేకుండా చాలా క్లియర్‌గా తీర్చిదిద్దాడు. కథలోని లింకుల్ని కనెక్ట్ చేసిన విధానం చాలా బాగుంది. ఒకదాని తర్వాత ఒక ట్విస్టులతో ప్రేక్షకుల్ని బాగా థ్రిల్ చేయగలిగాడు. కానీ.. కథనంలో వేగం మాత్రం లోపించింది. ఇంటర్వెల్, సెకండాఫ్ మినహా మిగతాదంతా సాధారణంగా సాగినట్లు అనిపిస్తుంది. కథనానికి తగ్గట్టు బలమైన సన్నివేశాలు లేవు. కొన్నిచోట్ల సీన్లు రిపీట్ అయినట్లు అనిపించడంతో కాస్త బోర్ కొడుతుంది. క్లైమాక్స్‌ని కూడా అవనసరంగా సాగదీశారు.

ఓవరాల్‌గా చూస్తే.. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా తరహాలో విఐ ఆనంద్ ‘ఒక్క క్షణం’తో ఆడియెన్స్‌ని పూర్తిగా ఎంగేజ్ చేయలేకపోయాడు. కథ, ట్విస్టులు థ్రిల్‌నిచ్చాయి కానీ.. మొత్తంగా మాత్రం సినిమా ఫర్వాలేదనిపించిందంతే. ఇందులోని మైనస్ పాయింట్స్‌ని తీసేస్తే.. ఇది చూడదగిన సినిమానే! రొటీన్‌కి భిన్నంగా కోరుకునే వారికి ఇది ఇట్టే కనెక్ట్ అయిపోతుంది.

నటీనటుల పనితీరు :
గత చిత్రాలతో పోలిస్తే అల్లుశిరీష్ నటనపరంగా పరిణితి కనబరిచాడు. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో నటించి.. ఆడియెన్స్‌ని మెప్పించాడు. హీరోయిన్‌గా నటించిన సురభి.. అభినయంతోపాటు అందంతోనూ ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రంలో కీలకపాత్రల్లో నటించిన అవసరాల శ్రీనివాస్, సీరత్ కపూర్‌లు తమ పరిధి మేరకు మెప్పించారు. అతిధి పాత్రలో నటించిన దాసరి అరుణ్ మంచి విలనిజాన్ని పండించాడు. మిగతా నటీనటులు ఫర్వాలేదు.

టెక్నికల్ పనితీరు :
శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. మణిశర్మ అందించిన పాటలు ఆకట్టుకోలేదు కానీ.. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయింది. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ బ్రహ్మాండంగా ఉంది. సినిమాలో కన్ఫ్యూజన్ లేకుండా చాలా బాగా ఎడిట్ చేశాడు. నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఇక దర్శకుడు వీఐ ఆనంద్.. తాను ఎంచుకున్న కాన్సెప్ట్, దానిచుట్టూ రాసుకున్న కథ, కథనాలు బాగున్నాయి. కానీ.. వాటికి తగ్గల బలమైన సీన్లు లేకపోవడంతో థ్రిల్ మిస్ అయ్యింది.

చివరగా : చివరిబంతికి సిక్స్ కొట్టిన శిరీష్
రేటింగ్ : 3.25/5

Related posts:
విశాల్, క్యాథరిన్ ‘కథకళి’ రివ్యూ, రేటింగ్ & అనాలసిస్.. కిక్కిచ్చే థ్రిల్లింగ్ సినిమా!
హిందీలో క్షణం చేస్తున్న బాలీవుడ్ హీరో ఎవరంటే..
కర్ణాటకలో రికార్డ్ కలెక్షన్స్ రాబట్టిన ‘సరైనోడు’
‘బాబు బంగారం’ ట్రైలర్ టాక్ : ‘బొబ్బిలి రాజా’ ఈజ్ బ్యాక్!
సంచలన రికార్డ్‌తో ఇండస్ట్రీని హడలెత్తించిన మహేష్
టాలీవుడ్‌లో ఆ ఫీట్ సాధించిన ఏకైక హీరో తారకే!

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.