కన్ను కొట్టింది.. వైరల్ అయింది.. అసలెవరీ అమ్మాయి?

నిన్నటినుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఓ అమ్మాయి తెగ కనిపించేస్తోంది. ఏ ప్లాట్‌ఫాం ఓపెన్ చేసినా సరే.. ఆ అమ్మాయి తప్ప ఇంకో టాపిక్కే లేదు. సమస్యలు, ఇతర విశేషాలేన్నో ఉన్నప్పటికీ.. వాటిని పక్కనపెట్టి ప్రతిఒక్కరూ ఆ బ్యూటీ గురించే చర్చించుకుంటున్నారు. అంతలా ఆమె ఏమైనా పెద్ద సాహసం చేసిందా అంటే అదీ లేదు. జస్ట్.. క్యూట్ ఎక్స్‌ప్రెషన్‌తో అలా ఒక్కసారి కన్నుకొట్టిందంతే! దెబ్బకు ప్రతిఒక్కరూ ఆమె మాయలో పడిపోయారు.

ఆమె పేరు ప్రియా ప్రకాష్ వారియర్. ప్రస్తుతం మలయాళంలో ‘ఓరు అదార్ లవ్’ పేరుతో రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. కాలేజ్ నేపథ్యంలో లవ్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి ‘‘మాణిక్య మలరాయ పూవీ’’ అనే వీడియో సాంగ్‌ని విడుదల చేశారు. అది ఇలా రిలీజ్ అవ్వడమే ఆలస్యం.. యూట్యూబ్‌లో ఒక్కసారిగా వైరల్ అయ్యింది. అది అలా వైరల్ అవ్వడానికి కారణం.. ప్రియాప్రకాషే కారణం. ఆ పాటలో ఆమె ఫుల్ లెంగ్త్‌లో లేదు. కేవలం 15 సెకనులపాటు మాత్రమే వుంది. ఓ మెలోడియన్ ట్యూన్ వద్ద ఆమె ఇచ్చిన హావభావాలు ఎంత అద్భుతంగా వున్నాయంటే.. ఎలాంటివారైనా ఫిదా అయిపోవాల్సిందే. అందుకే.. చూసిన ప్రతిఒక్కరూ ఫిదా అవ్వడంతో ఆ వీడియో ముఖ్యంగా ఆ అమ్మాయి ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది.

ఫేస్‌బుక్ ఎకౌంట్ సంగతేమోగానీ.. ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం పెద్ద సునామీ వచ్చింది. కేవలం ఒకేఒక్కరోజులో 1 మిలియన్ ఫాలోవర్స్‌ని ఆమె సంపాదించింది. ఇప్పటికీ ఈ వీడియో ట్రెండ్ అవుతూనే ఉందంటే.. ప్రియా ఎక్స్‌ప్రెషన్సే కారణం. ప్రస్తుతం ఆమె బీకామ్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది.

Related posts:
మహేష్ బావ సుధీర్ హిందీ (బాఘీ) సినిమా ట్రైలర్ అదుర్స్
‘నాన్నకు ప్రేమతో’లో నటించి చాలా బాధపడ్డా : జగపతిబాబు
రాజ్ తరుణ్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత
‘ప్రేమమ్’ బ్యూటీని బుట్టలో పడేసిన శర్వానంద్
‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ వెనుక పృథ్వీ చెప్పిన ఇంట్రెస్టింగ్ స్టోరీ
బిగ్ అనౌన్స్‌మెంట్ : మల్టీస్టారర్ కన్ఫమ్ చేసేసిన రాజమౌళి

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.