ఫస్ట్‌వీకెండ్ కలెక్షన్స్‌తో గోపీచంద్‌కు అందని ఆక్సిజన్!

టాలీవుడ్ మ్యాచో మ్యాన్ గోపీచంద్ నటించి ఆక్సిజన్ సినిమా ఎట్టకేలకు నవంబర్ 30న రిలీజ్ అయ్యింది. ఎప్పుడో షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా రిలీజ్‌ను వరుసగా వాయిదా వేసుకుంటూ వచ్చింది. కానీ అందరికీ షాకిస్తూ నవంబర్ 30న రిలీజ్ అయిన ఆక్సిజన్ సినిమా రిలీజ్ రోజున మంచి టాక్‌ను సంపాదించుకోవడంతో ఇండస్ట్రీ చూపును తనవైపు తిప్పుకుంది. అయితే ఈ టాక్‌ ఆ సినిమాకు ఏమాత్రం ఉపయోగపడలేదు. దీంతో బాక్సాఫీస్ వద్ద చాలా దారుణంగా తయారయ్యింది ఆక్సిజన్ పరిస్థితి. ఫస్ట్ వీకెండ్ ముగిసే సరికి ఈ సినిమా కేవలం రూ. 3.59 కోట్లు వసూలు చేసి డిస్ట్రిబ్యూటర్ల నోట్లో మట్టి కొట్టింది. జ్యోతికృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రాశి ఖన్నా, అను ఇమ్మాన్యుయెల్‌ హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.

ఏరియా – ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్(కోట్లలో)
నైజాం – 1.02
సీడెడ్ – 0.60
ఉత్తరాంధ్ర – 0.40
గుంటూరు – 0.43
తూర్పు గోదావరి – 0.18
కృష్ణా – 0.20
పశ్చిమ గోదావరి – 0.19
టోటల్ ఏపీ+తెలంగాణ – 3.14
రెస్టాఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ – 0.45
టోటల్ వరల్డ్‌వైడ్ – 3.59 కోట్లు

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.