ఆక్సిజన్, జవాన్‌ల యుఎస్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. డిజాస్టర్ రిపోర్ట్

oxygen jawaan usa first weekend box office report
Tellmeboss.net

తెలుగు సినిమాలకు యూఎస్ఏలో గడ్డుకాలం నడుస్తోంది. రిలీజ్ అవుతున్న ప్రతి సినిమా దారుణమైన వసూళ్లతో చాపచుట్టేస్తోంది. మంచి అంచనాల మధ్య వచ్చిన చిత్రాలు సైతం డిజాస్టర్స్‌గా నిలుస్తున్నాయి. తాజాగా ‘ఆక్సిజన్’, ‘జవాన్’ సినిమాలు కూడా ఆ లిస్ట్‌లోకి చేరిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో ఫర్వాలేదనిపించే కలెక్షన్స్ నమోదు చేయగలుగుతున్నాయి కానీ.. యూఎస్‌లో మాత్రం తొలి వీకెండ్‌కే తోక ముడుచుకున్నాయి.

Tellmeboss.net

తొలుత ‘ఆక్సిజన్’ విషయానికొస్తే.. ఇది కనీసం చెప్పుకోదగిన వసూళ్లు కూడా కలెక్ట్ చేయలేకపోయింది. ప్రీమియర్లతో సహా కలుపుకుని టోటల్ ఫస్ట్ వీకెండ్‌లో $21k (రూ.13.65 లక్షలు) మాత్రమే వసూలు చేసింది. నిజానికి.. ఈ చిత్రం సరికొత్త సబ్జెక్ట్‌తో రూపొందింది కాబట్టి దీనికి మంచి ఆదరణ లభిస్తుందని అంతా భావించారు. కానీ.. అందుకు భిన్నమైన రిజల్ట్‌తో ఈ చిత్రం అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పెర్ఫార్మెన్స్ చూసి.. ఇకపై నడవదని తీసిపారేసి, వేరే సినిమాల్ని చాలా థియేటర్లలో రీప్లేస్ చేశారు.

ఇక ‘జవాన్’ గురించి మాట్లాడితే.. ‘ఆక్సిజన్’తో పోల్చుకుంటే కాస్త బెటర్ వసూళ్లే రాబట్టింది. ప్రీమియర్స్ ద్వారా తేజు కెరీర్‌లో రికార్డ్ గ్రాస్ కొల్లగొట్టింది కానీ.. ఆ తర్వాత పెద్దగా సత్తా చాటుకోలేకపోయింది. ఆ లెక్కలు చూస్తే.. ప్రీమియర్స్ $45230, శుక్రవారం $37936, శనివారం $42228, ఆదివారం $25k రాబట్టింది. అంటే.. మొత్తం వీకెండ్‌లో $150834 వసూలు చేసింది. ఇక్కడితో ఈ చిత్రం కథ కూడా కంచికి చేరిందని ట్రేడ్ నిపుణులు పేర్కొంటున్నారు.

గోపీచంద్, తేజు ఇద్దరూ యూఎస్‌లో సత్తా చాటుకోవాలని ఎంతో ప్రయత్నిస్తున్నారు కానీ.. వీళ్లు చేసే రొటీన్ సినిమాలే వీరికి దెబ్బేస్తున్నాయి. పూర్తి కన్వీన్స్ స్ర్కిప్ట్‌తో మంచి చిత్రాలు చేయలేకపోతుండడంతో.. ఇక్కడ కూడా ఫ్లాప్‌లు చవిచూస్తున్నారు. ఈ ఇద్దరు హీరోలు గాడిలోకి రావాలంటే.. ఖచ్ఛితంగా సెలెక్షన్ మారాల్సిందే.

Tellmeboss.net
Related posts:
రుద్ర‌మ‌దేవి ఫ‌స్ట్ షో డీటైల్స్‌
నెట్టింట్లో ‘జంగిల్ బుక్’ ట్రైలర్ ప్రభంజనం.. తక్కువ టైంలో ఎక్కువ వ్యూస్
70 రోజుల్లో ‘బాహుబలి’ ఆల్‌టైమ్ రికార్డ్‌ని బ్రేక్ చేసిన ‘సరైనోడు’
పవన్ కళ్యాణ్ ‘కాటమరాయుడు’ మూవీ ప్రీ-రివ్యూ
‘జై లవ కుశ’.. పాత చింతకాయ పచ్చడే!
‘స్పైడర్’ ఇన్‌సైడ్ టాక్.. యాక్షన్ లవర్స్‌కి గ్రాండ్ ట్రీట్

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.