పద్మావత్ రివ్యూ, రేటింగ్ & అనాలసిస్

చిత్రం : పద్మావత్
నటీనటులు : దీపికా పదుకొనే, రణవీర్ సింగ్, షాహిద్ కపూర్ తదితరులు
సంగీతం : సంజయ్ లీలా భన్సాలీ
సినిమాటోగ్రఫీ : సుదీప్ ఛటర్జీ
ఎడిటింగ్ : జయంత్ జాదర్, సంజయ్ లీలా భన్సాలీ, అకివ్ అలీ
నిర్మాతలు : సంజయ్ లీలా భన్సాలీ, సుధాంశ్ వత్స్, అజిత్ అంధారే
దర్శకత్వం : సంజయ్ లీలా భన్సాలీ

గతకొద్ది రోజులుగా బాలీవుడ్‌లో ‘పద్మావత్’(పద్మావతి) చిత్రం గురించి దేశవ్యాప్తంగా చర్చ జరిగుతోంది. ఈ చిత్రం క్రియేట్ చేసిన వివాదం మామూలుగా లేకపోవడంతో ఈ చిత్రంపై అంచనాలు కూడా తారాస్థాయికి చేరుకున్నాయి. ఇక ఈ సినిమాను రాజ్‌పుత్ వర్గం వారు బహిష్కరిస్తామని చెప్పడంతో ఈ సినిమా రిలీజ్ నిరవధికంగా వాయిదా పడింది. అయితే ఈ సినిమాను జనవరి 25న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఇక ఇన్ని వివాదాలకు కేరాఫ్‌గా నిలిచిన పద్మావత్ చిత్రంలో అసలు విషయం ఏమిటో రివ్యూలో చూద్దాం..

కథ :
మేవాడ్ రాజు రావల్ రతన్ సింగ్(షాహిద్ కపూర్) తన మొదటి భార్యకు ముత్యాలు తేవడానికి సింహళ దేశానికి వస్తాడు. ఆ దేశ యువరాణి పద్మావత్(దీపికా పదుకొనే) వేటాడే సమయంలో… అనుకోకుండా ఆమె బాణం రతన్ సింగ్‌కు తగిలి ప్రమాదం జరుగుతుంది. అయితే రతన్‌సింగ్‌ను పద్మావత్ కాపాడుతుంది. పద్మావత్‌ని తొలి చూపులోనే ప్రేమించిన రతన్ సింగ్.. ఆమె తండ్రి అనుమతితో విహహం చేసుకుని మేవాడ్‌కు మహారాణిని చేస్తాడు. ఢిల్లీ సింహాస‌నంపై క‌న్నేసిన అప్ఘ‌నిస్థాన్ రాజు జ‌లాలుద్ధీన్ ఖిల్జీ త‌న సైన్యంతో ఢిల్లీని ఆక్ర‌మించుకుంటాడు. జ‌లాలుద్ధీన్ కుమార్తె మాలికా ఎ జ‌న‌త్ (అదితిరావ్ హైద‌రీ)ని ప్రేమించి పెళ్లి చేసుకున్న అల్లావుద్ధీన్ ఖిల్జీ కొంత‌కాలం త‌ర్వాత జ‌లాలుద్ధీన్‌ను చంపి సింహాస‌నాన్ని ఆక్ర‌మిస్తాడు. దేశద్రోహ శిక్షకు గురైన మేవాడ్ రాజగురువు రాఘవ చింతనుడు కారణంతో పద్మావత్ అంద చందాలు గురించి తెలుసుకున్న అల్లావుద్ధీన్ మేవాడ్‌పై దండెత్తుతాడు. ఆ తరువాత ఎదరయిన పరిస్థితులు ఏమిటి? అల్లావుద్ధీన్ పద్మావత్‌ని దక్కించుకున్నాడా? లేదా? అనే విషయాలు తెలియాలంటే సినిమాను వెండితెరపై చూడాల్సిందే!

విశ్లేషణ :
దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఇండియాలోనే టాప్ డైరెక్టర్స్ జాబితాలో ఎందుకు నిలిచాడో ఈ సినిమాతో మరోసారి నిరూపించుకున్నాడు. ఎవ్వరూ చేయని సాహసాన్ని తాను చేసి చూపించాడు. ముఖ్యంగా హిస్టారికల్ సినిమాలు జోథా అక్బర్, బాజీరావ్ మస్తానీ వంటి వాటిని తెరకెక్కించి ప్రశంసలు అందుకున్న సంజయ్ లీలా భన్సాలీ.. అంతే గ్రాండియర్‌గా ‘పద్మావత్’ను తెరకెక్కించారు. ఇక పద్మావత్ సినిమా సదరు ప్రేక్షకుడికి ఫుల్ మీల్స్ అనే చెప్పాలి. పద్మావత్ చిత్రంలోని కోటలు, రాజసం, పౌరుషం.. అన్నీ కూడా భారీతీయ చరిత్రకు గుర్తుగా చూపించాడు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ. ఇక ఈ చిత్ర కథనం ఎక్కడా కూడా మనల్ని కంటిపై రెప్పవేయనీదు. అంతలా అదిరిపోయే రీతిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు భన్సాలీ.

రాజ్ పుత్ ల సాహ‌సం.. ధైర్యం.. వాళ్ల తెగింపు ఎలా ఉంటాయో చూపించిన భ‌న్సాలీ.. రాజ‌పుత్రిక‌ల ఆత్మ‌గౌర‌వం ఎంత స్థాయిలో ఉంటుందో కూడా చ‌క్క‌గా ఆవిష్క‌రించాడు. ఫ‌స్టాఫ్ అంతా క‌థ‌లోకి తీసుకెళ్ల‌డానికి నెమ్మ‌దిగా సాగిన‌ట్లు అనిపిస్తుంది. సెకండాఫ్ మొద‌లైన త‌ర్వాత క్లైమాక్స్ వ‌ర‌కు ప్ర‌తీ సీన్ అద్భుత‌మే. భ‌న్సాలీ ఊహ‌ల‌కు దీపిక‌.. షాహిద్.. ర‌ణ్ వీర్ ప్రాణం పోసారు. అయితే ఈ చిత్రంలో ప్రేక్ష‌కుడు కాస్త నిరుత్సాహ‌ప‌డే విష‌యం మాత్రం యుద్ధ స‌న్నివేశాలే. ఏదో ఉంటాయ‌ని అనుకున్న వాళ్ల‌కు ఎమోష‌న్ తోనే క‌థ న‌డిపించాడు కానీ యుద్ధాలు పెద్దగా ప‌ట్టించు కోలేదు ద‌ర్శ‌కుడు. త‌న మార్క్ స్క్రీన్ ప్లేతో ఎక్క‌డా బోర్ కొట్ట‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డాడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ. పైగా అత‌డి విజువ‌ల్ గ్రాండియ‌ర్ చూసి ప్రేక్ష‌కులు మైమ‌రిచిపోవ‌డం ఖాయం. ఫ‌స్టాఫ్ అంతా ప‌ద్మావ‌తి ప్రేమ‌.. పెళ్లి.. అల్లాఉద్దీన్ రాజ్య‌కాంక్ష‌ను చూపించిన భ‌న్సాలీ.. సెకండాఫ్ ను పూర్తిగా ఎమోష‌న‌ల్ గా న‌డిపించాడు. క‌థ ఎక్క‌డా త‌ప్పుదోవ ప‌ట్టుకుండా.. ముఖ్యంగా ప‌ద్మావ‌తి, ఖిల్జీ మ‌ధ్య సీన్స్ ను చాలా జాగ్ర‌త్త‌గా హ్యాండిల్ చేసాడు ద‌ర్శ‌కుడు. మొత్తానికి సంజయ్ లీలా భన్సాలీ ఒక హిస్టారికల్ ఎపిక్‌ను ఎక్కడా తగ్గకుండా చూసుకుంటూనే ఎంటర్‌టైన్‌మెంట్‌ను కూడా అందించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు.

నటీనటుల పర్ఫార్మెన్స్:
ఈ సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన దీపికా పదుకొనె – షాహిద్ కపూర్ – రణవీర్ సింగ్ నటన ఆకట్టుకునే విధంగా ఉంది. దీపికా ప‌దుకొనే హుందాగా ప‌ద్మావ‌తిగా క‌నిపించింది. ర‌త‌న్ సింగ్‌గా షాహిద్ న‌ట‌న మెచ్చుకోవాల్సిందే. ఇక ఖిల్జీ పాత్ర‌లో న‌టించిన ర‌ణ‌వీర్ సింగ్ న‌ట‌న మిగ‌తా వారంద‌రినీ డామినేట్ చేసింది. అత‌డి న‌ట‌నే సినిమాకు మేజ‌ర్ హైలెట్‌.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతోంది. ఒక సాహసమైన కథను ఎంచుకోవడమే కాకుండా దాన్ని తీర్చిదిద్దిన విధానం అమోఘం. ఇక మల్టీ-ట్యాలెంట్ అంటే ఏమిటో భన్సాలీ చిత్రాలే మనకు చూపిస్తాయి. భన్సాలీ ఇచ్చిన మ్యూజిక్ చాలా బాగుంది. పాటలకంటే కూడా బ్యాక్‌గ్రౌండ్ బ్యూజిక్ అదిరింది. సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. ఎడిటింగ్ వర్క్ బాగుంది.

చివరిగా: పద్మావత్ – రాజ్‌పుత్‌ల పౌరుషానికి కేరాఫ్ అడ్రస్!

నేటిసినిమా రేటింగ్: 4/5

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.