పైసా వసూల్ మూవీ రివ్యూ, రేటింగ్ & అనాలసిస్

చిత్రం : పైసా వసూల్
డైరెక్టర్ : పూరీ జగన్నాధ్
నిర్మాత : వి. ఆనంద్ ప్రసాద్
సినిమాటోగ్రఫీ : ముఖేష్
మ్యూజిక్ : అనూప్ రెబెన్స్
నటీనటులు : నందమూరి బాలకృష్ణ, శ్రియా శరన్, ముస్కాన్ సెఠీ, కైరా దత్, కబీర్ బెడీ, అలీ తదితరులు

నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం పైసా వసూల్ నేడు వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఇక క్రేజీ సినిమాల డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో బాలయ్య నటిస్తున్నాడని తెలిసిన వెంటనే ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. పైసా వసూల్ చిత్ర టీజర్, ట్రైలర్లతో ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి. మరి ఇంతటి క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా నిజంగానే అభిమానులకు పైసా వసూల్ సినిమానా కాదా అనే విషయం రివ్యూలో చూద్దాం.

కథ:
తేడా సింగ్(బాలకృష్ణ) ఎవ్వరికీ భయపడే వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. ఇక ఎదుటివారు ఎంతటివారైనా డోంట్ కేర్ అంటూ తన దారిలో తాను వెళుతుంటాడు. అయితే ఇండియన్ రా ఎజేన్సీని గడగడలాడించే గ్యాంగ్‌స్టర్ బాబ్ మార్లీ. అతడిని అంతమొందించాలనే ప్లాన్‌తో ఆ డీల్‌ను తేడా సింగ్‌కు అప్పగిస్తారు రా ఏజెన్సీ వారు. అలా పోలీసులతో ఒప్పందం కుదుర్చుకున్న తేడా సింగ్ ఏం చేశాడు? చివరికి బాబ్ మార్లీ ఎలా అంతమయ్యాడు? అసలు తేడా సింగ్ గతమేమిటి? అనేదే ఈ సినిమా కథ.

విశ్లేషణ:
మొదట్నుండీ కూడా ఈ సినిమాలో బాలయ్య కొత్త గెటప్‌లో కనిపిస్తాడనే వార్తను నిజం చేసి ఓ సరికొత్త స్టైలిష్ లుక్‌తో బాలయ్య ఎంట్రీ సినిమాలో మనం చూడొచ్చు. ఇక తేడా సింగ్ క్యారెక్టర్‌లో బాలయ్య వావ్ అనిపించాడు. పైసా వసూల్ సినిమాకు మేజర్ హైలైట్‌గా బాలయ్య నిలుస్తాడు. ఎప్పుడూ నవ్వుతూ, భయమనేదే లేకుండా, సరదా సరదాగా ఉంటూ, నచ్చింది చేసే క్రిమినల్ గా బాలయ్య మెప్పించాడు. ఇక కథ రెగ్యులర్ కథే అయినప్పటికీ పూరి రాసిన తేడా సింగ్ పాత్ర మూలాన, అందులో బాలకృష్ణ నటించడం వలన సినిమా ఫస్టాఫ్ వరకు పర్వాలేదనిపించేలా సాగిపోయింది.

సెకండాఫ్‌లో బాలయ్య మరింత ఎనర్జీతో కనిపించి సినిమాపై ఆసక్తిని పెంచుతాడు. ఇక హీరోయిన్ శ్రియాతో బాలయ్య లవ్ ట్రాక్ సింప్లీ సూపర్. వీరిద్దరి కాంబినేషన్‌ సినిమాకు బాగా కలిసొచ్చింది. సినిమాలో కొత్తదనం ఏమీ లేకపోవడంతో జనరల్ ఆడియెన్స్ డిసప్పాయింట్ అవుతారు. ప్రీ క్లైమాక్స్‌కు వచ్చేటప్పటికి రెగ్యులర్ ట్విస్ట్ రివీల్ అవడం, ఎప్పటిలానే హీరోలోని కొత్త యాంగిల్ బయటపడటం, అభిమానుల కోసం మాత్రమే అన్నట్టు హీరో ఎలివేషన్ జరగడం వంటివి నీరసాన్ని కలిగించాయి. ఓవరాల్‌గా బాలయ్య పర్ఫార్మెన్స్ కోసం వెళ్లే వారిక ఈ సినిమాతో పూర్తిగా పైసా వసూల్ అవుతోంది. కానీ పూరీ మీద నమ్మకంతో వెళితే మాత్రం తిట్టుకుంటూ బయటకు రావడం ఖాయం.

నటీనటుల పర్ఫార్మెన్స్:
పైసా వసూల్ చిత్రానికి ఉన్న అతిపెద్ద అడ్వాంటేజ్ నందమూరి బాలకృష్ణనే. అందుకు తగ్గట్టుగా బాలయ్య మరోసారి తన పర్ఫార్మెన్స్‌తో సిల్వర్ స్రీన్‌ను చించేశాడు. తేడా సింగ్ పాత్ర తనకోసమే ఉందా అనే విధంగా బాలయ్య పాత్రలో జీవించేశాడు. ఇక బాలయ్య ఎనర్జీ లెవెల్స్ ఈ సినిమాలో ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. హీరోయిన్ శ్రియా తనకు కేటాయించిన క్యారెక్టర్‌లో పర్వాలేదనిపించింది. కొత్త పిల్ల ముస్కాన్ మాత్రం ఆకట్టుకోవడంలో విఫలమైంది. బాలీవుడ్ బ్యూటీ కైరా దత్, అలీ తదితరులు వారివారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
ఈ చిత్రానికి సంబంధించి మనం ముందుగా చెప్పుకోవాల్సింది డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి. వరుస ఫెయిల్యూర్స్‌తో సతమతమవుతున్న డైరెక్టర్ ఈసారి ఏదైనా కొత్త సబ్జెక్ట్‌తో వస్తాడేమో అని అనుకున్నారు అందరు. కానీ అతడు మాత్రం తన రొటీన్ ఫార్ములాను వదల్లేకపోయాడు. కొత్తదనం అనేదే లేని సబ్జెక్ట్‌తో వచ్చి మరోసారి పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. డైలాగుల పరంగా మాత్రం పూరీకి మంచి మార్కులు పడ్డాయి. అతడు రాసిన డైలాగులను బాలయ్య నోట వింటుంటే థియేటర్స్‌లో విజిల్స్ వేస్తారు. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్క సన్నివేశాన్ని చాలా అద్భుతంగా చూపించారు. ముఖ్యంగా పోర్టుగల్‌లో జరిగే సీన్స్, చేజ్‌లు చాలా బాగా వచ్చాయి. ఎడిటింగ్ పని కూడా బాగుంది. మ్యూజిక్ విషయానికి వస్తే అనూప్ రూబెన్స్ మంచి సంగీతాన్ని అందించాడు. కొన్ని పాటలు బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్‌గా ఉన్నాయి.

చివరిగా: బాలయ్య కోసం వెళితే ఫుల్ ‘పైసా వసూల్’

నేటిసినిమా.కామ్ రేటింగ్: 3/5

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.