మెహరీన్ పంతం నెగ్గుతుందా..?

నాని కృష్ణగాడి వీర ప్రేమగాధ చిత్రంతో తెలుగులో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన మెహరీన్ ఆ తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఈ బ్యూటీ చేసిన సినిమాల్లో ఫ్లాపులే ఎక్కువ. అయినా ఆఫర్స్ మాత్రం అమ్మడిని వెతుక్కుంటూ వచ్చాయి. అయితే గత కొంతకాలంగా చేసిన ప్రతీ సినిమా ఫ్లాపులుగా మిగులుతుండటంతో ఇప్పుడు కేవలం రెండే సినిమాలు చేస్తోంది ఈ బ్యూటీ.

గోపీచంద్ హీరోగా నటిస్తున్న పంతం చిత్రంలో మెహరీన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా ఆమెకు చావో రేవో అన్న మాదిరిగా మారింది. ఈ సినిమా హిట్ అయితేనే అమ్మడికి మళ్లీ అవకాశాలు వెల్లువెత్తుతాయి. ఒకవేళ ఈ సినిమా ఏమాత్రం తేడా కొట్టినా ఈమెకు ఎఫ్‌2 చిత్రం ఒక్కటే దిక్కు. గోపీచంద్ కెరీర్‌లో 25వ చిత్రంగా వస్తున్న పంతం గోపీచంద్‌కు ఎంత ముఖ్యమో, మెహరీన్‌కు కూడా అంతే ముఖ్యం.

మరి ఈ సినిమాతో ఖచ్చితంగా సక్సెస్ కొడతానంటున్న మెహరీన్ పంతం నెగ్గుతుందా లేదా అన్నది చిత్రం రిలీజ్ అయిన తరువాత తెలుస్తోంది. ఏదేమైనా పంతం సినిమాపై అమ్మడు ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉందనే విషయం అర్ధమవుతుంది.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.