శ్రీరెడ్డికి పవిత్ర కౌంటర్.. క్యాస్టింగ్ కౌచ్ తప్పుకాదట!

‘క్యాస్టింగ్ కౌచ్’కి వ్యతిరేకంగా గతకొన్నాళ్ళ నుంచి పోరాటం కొనసాగిస్తున్న శ్రీరెడ్డికి ఇండైరెక్ట్‌గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్రాలోకేష్ కౌంటర్ ఇచ్చింది. అసలు క్యాస్టింగ్ కౌచ్ పెద్ద సమస్యే కాదని చెప్పిన ఆమె.. నాలుగు గోడుల నడుమ ఆడ-మగ మధ్య జరిగేది ప్రకృతి దర్శమని ఆమె కుండబద్దలు కొట్టింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె చాలానే సంచలన విషయాలను చెప్పుకొచ్చారు.

‘‘కాస్టింగ్ కౌచ్ అనేది చాలా సున్నితమైనది.. ఈ విశ్వంలో ఆడ – మగ అనే రెండే జాతులున్నాయి. ఆడవాళ్లు మగవాళ్లని.. మగవాళ్లు ఆడవాళ్లను ఉపయోగించుకోవడం అనేది అన్ని రంగాల్లో ఉంది. అదే ప్రకృతి ధర్మం. మనం బతకడానికి డబ్బు అవసరం. అధికమొత్తంలో డబ్బు కావాలని భావిస్తే అదే స్థాయిలో ఇతర పనులు కూడా చేయాలి. కానీ.. ఆ పనిచేసే ముందు ఎందుకు చేస్తున్నాం అని ఆలోచించాలి. అంగీకరించి ఆ పనిచేస్తే అది మన సమస్య మాత్రమే అవుతుంది. కాస్టింగ్ కౌచ్ అనేది నా దృష్టిలో చాలా పెద్ద పేరు. 4-5 ఏళ్ల చిన్నారులు రేప్‌కు గురవుతున్నారు. ఇది అసలు పెద్ద విషయం. ఎవరైనా మాట్లాడితే ఈ చిన్న పిల్లల దారుణాలపై మాట్లాడండి.. కాస్టింగ్ కౌచ్‌పై కాదు’’

‘‘అయినా.. పరిణతి చెందిన ఇద్దరు ఆడ-మగ మధ్య జరిగిన వ్యవహారం గురించి ఎందుకింత రచ్చ. దీనికి అంగీకరిస్తున్న వారందరూ 4-5 ఏళ్ల చిన్నారులైతే కాదు కదా! ఏదో ఆశించి ఈ పనికి ఒప్పుకుంటున్న వారే.. అలాంటప్పుడు దీనికి కాస్టింగ్ కౌచ్ అంటూ గేములు ఎందుకాడాలి? ప్రతిఒక్కరూ అన్నీ అగ్రిమెంట్ ప్రకారం అంగీకరిస్తున్నారు. ఒకవేళ వద్దనుకుంటే.. మొదట్లోనే రిజెక్ట్ చేసే ఛాయిస్ ఉంది. కానీ.. ఎందుకలా చేయరు? అప్పుడు వద్దనుకుండా ఇప్పుడు బయటికొచ్చి వాడుకున్నారని గోల చేయడం కరెక్ట్ కాదు’’ అంటూ పవిత్రా లోకేష్ వివరించింది.

ఇక్కడ పవిత్రా లోకేష్ డైరెక్ట్‌గా శ్రీరెడ్డి పేరైతే ఉపయోగించలేదు కదా.. ప్రస్తుతం క్యాస్టింగ్ కౌచ్ అంటూ రచ్చ చేస్తోంది ఆమెనే కాబట్టి ఈ వ్యాఖ్యలన్నీ కౌంటర్‌గా చేసినట్లేనని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మరి.. ఇందుకు శ్రీరెడ్డి ఎలా బదులిస్తుందో చూడాలి.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.