పూనమ్ ‘కళ్యాణం’ వెనుక పవన్ హస్తం..?

గతకొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో పూనమ్ కౌర్ చేస్తున్న రచ్చ గురించి అందరికీ తెలిసిందే! కత్తి, పవన్ ఫ్యాన్స్ వివాదం టైంలో లైమ్‌లైట్‌లోకి వచ్చిన ఈ అమ్మడు.. కత్తిపైనే కాకుండా పవన్ మీదా ఇండైరెక్ట్‌గా సంచలన ఆరోపణలు చేసింది. తర్వాత వాటిని డిలీట్ చేసి, పవన్ ఫ్యాన్స్ కన్వీన్స్ అయ్యేలా ఏవో కారణాలు చెప్పుకుందిలెండి! తిరిగి కొన్నాళ్ళకి త్రివిక్రమ్ పేరు చెప్పకుండానే అతనిపై కూడా ‘ఎఫైర్’ అభాండాలు మోపింది. ఇవి పూనమ్ సినీ కెరీర్‌పై ఖచ్చితంగా ప్రభావం చూపుతాయని అంతా భావించారు. కానీ తీరా చూస్తే.. అందరి ఫ్యూజులు ఎగిరిపోయే దృశ్యం ఒకటి వెలుగులోకి వచ్చింది.

దిల్‌రాజు నిర్మాణంలో నితిన్, రాశీఖన్నా జంటగా రూపొందుతున్న ‘శ్రీనివాస్ కళ్యాణం’కి సంబంధించి రీసెంట్‌గా ఒక మేకింగ్ వీడియో రిలీజైంది. దాదాపు పెళ్లి సందడితోనే సాగిన ఈ వీడియోలో.. పూనమ్ కౌర్ కూడా చాలా ఫ్రేమ్స్‌లో తళుక్కుమని మెరిసింది. ఇదే ఇండస్ట్రీలో ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. చాలాకాలం నుంచి ఆఫర్స్ లేక సతమతమవుతున్న పూనమ్‌కి ఇందులో ఎలా ఛాన్స్ వచ్చిందా? అనే విషయంపై చర్చ మొదలైంది. గతంలో ఓసారి పవన్‌పై, మొన్న త్రివిక్రమ్‌పై తీవ్ర కామెంట్స్ చేసినప్పటికీ ఈ చిత్రంలో ఆమెకి ఛాన్స్ రావడం షాకింగ్‌గా మారింది. అసలు ట్విస్ట్ ఏంటంటే.. పవన్‌కి నితిన్ వీరాభిమాని! తనకు ‘అ ఆ’లాంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చాడు కాబట్టి త్రివిక్రమ్‌నీ అంతే ఆరాధిస్తాడు. అలాంటి ఆ ఇద్దరిపై కామెంట్స్ చేసిన పూనమ్‌కి తన చిత్రంలో ఛాన్స్ ఇవ్వడం మరో మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.

బహుశా ఆమె కోపాన్ని చల్లార్చడం కోసమే పవన్, త్రివిక్రమ్‌లు డిస్కస్ చేసుకుని.. ఇలా నితిన్ చిత్రంలో ఛాన్స్ ఇప్పించినట్లు ఉన్నారని ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలాడుకుంటున్నారు. ‘స్వర్ణఖడ్గం’ సీరియల్‌లో ఛాన్స్ రావడం వెనుక కూడా వీరి హస్తం ఉండొచ్చని మరో పుకారు! ఏదేమైనా.. పూనమ్ కెరీర్ ఇప్పుడు మళ్ళీ పుంజుకుంటోందని చెప్పుకోవచ్చు.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.