ఫ్యూజులు ఎగిరిపోయే ట్విస్ట్.. పవన్ డబ్బులతో తారక్ ‘డ్రామా’!

Tellmeboss.net

ఇద్దరు స్టార్ హీరోలు ఏదో ఒక ఈవెంట్‌లో సరదాగా కలిశారని తెలిస్తేనే.. ఇండస్ట్రీలో పండుగ వాతావరణం నెలకొంటుంది. అప్పటివరకు కొట్టుకున్న ఇరువర్గాల ఫ్యాన్స్ ఒక్కసారిగా కలిసిపోతారు. సాధారణ ప్రేక్షకుల్లోనూ అదో తెలీని ఆనందం కలుగుతుంది. ముఖ్యంగా.. తరతరాలుగా పోటీ పడుతున్న ఫ్యామిలీ హీరోలు కలిశారంటే ఇక సంబరాలు జరుపుకుంటారు. అలాంటిది.. ఒక హీరో చిత్రానికి మరో హీరో నిర్మాతగా వ్యవహరిస్తున్నాడంటే మామూలుగా వుంటుందా? ఆ కిక్కే వేరుగా వుంటుంది. ఇప్పుడు అలాంటి కిక్కే జనాలకిస్తున్నారు పవన్, ఎన్టీఆర్‌లు!

Tellmeboss.net

ఒకప్పుడు ఈ రెండు ఫ్యామిలీల మధ్య ఎలాంటి పోరు వుండేదో అందరికీ తెలుసు. పోటీపడి మరీ తమ సినిమాల్ని ఒకేరోజు రిలీజ్ చేసేశారు. మేమంటే మేము గొప్ప అంటూ వాగ్వివాదాలకు దిగేవారు. ఫ్యాన్స్ అయితే కొట్టుకునే వరకు వెళ్ళేవారు. కానీ.. ఇప్పుడు ట్రెండ్ మారింది. అందరూ కలిసిమెలిసి వుంటున్నారు. చిరు, బాలయ్యలు ఇందుకు పునాది వేస్తే.. పవన్, ఎన్టీఆర్‌లు దానిపై భవనం లేపి మరింత బలపరిచారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న 28వ చిత్ర ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. పవన్, ఎన్టీఆర్‌లు తొలిసారి ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో.. ఫ్యాన్స్ సందడి చేసుకున్నారు. నిత్యం కొట్టుకునే ఇరువర్గాలు బ్రదర్స్‌లా ఒక్కటయ్యారు. జస్ట్ కలుసుకున్నందుకే ఇంత మార్పు వచ్చింది కదా! ఇప్పుడు వారి మధ్య బంధాన్ని మరింత బలం చేకూర్చే వార్తొకటి వెలుగులోకి వచ్చింది.

ఎన్టీఆర్ సినిమాని పవన్ నిర్మించనున్నట్లు సమాచారం. అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయబోయే సినిమాకి నిర్మాత రాధాకృష్టతోపాటు పవన్ కళ్యాణ్ కూడా నిర్మిస్తున్నాడని తెలిసింది. ‘అజ్ఞాతవాసి’తో రాధాకృష్ణకి భారీ నష్టాలు వాటిల్లడంతో పవన్ ఈమేరకు నిర్ణయం తీసుకున్నాడని.. ఈ చిత్రానికి ‘సహ నిర్మాత’గా వ్యవహరించేందుకు సిద్ధమయ్యాడని తెలిసింది. ఇరువురి ఫ్యాన్స్‌కి ఈ వార్త పండగలాంటిదేనని చెప్పుకోవచ్చు.

Tellmeboss.net
Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.