క్లాస్ పీకిన పవన్.. నోరు తెరిచిన డైరెక్టర్.. ఎవరో తెలిస్తే షాకే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల అజ్ఞాతవాసి చిత్రంతో వచ్చి ఘోరంగా ఫెయిల్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాపై పవన్ ఫ్యాన్స్‌లోనే కాకుండా ఇండస్ట్రీ వర్గాల్లో సైతం భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ చిత్రం రిలీజ్ రోజునే సినిమా ఫెయిల్యూర్‌గా మిగిలింది. దీంతో ఈ సినిమా తరువాత పవన్ సినిమాలకు బ్రేక్ ఇచ్చేశాడు. ప్రస్తుతం తన పొలిటికల్ పనుల్లో బిజీగా ఉన్నాడు పవన్. అయితే పవన్ అంటే ఎక్కడలేని ఇష్టం ఉన్న ఓ స్టార్ డైరెక్టర్ రీసెంట్‌గా పవన్‌ను కలిసాడట.

గతంలో ఈ డైరెక్టర్ పవన్‌ కరీర్‌కు అదిరిపోయే హిట్‌తో బూస్ట్ ఇచ్చాడు. ఇప్పుడు మరోసారి పవన్ కోసం ఓ పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను రెడీ చేసి పవన్‌ను కలిశాడట. స్టోరీలైన్ చెప్పిన వెంటనే పవన్ ఓకే చేస్తాడని అనుకున్నాడట ఈ డైరెక్టర్. అయితే జరిగింది మాత్రం వేరు. పవన్ అసలు ఏమీ వినకుండానే మనోడికి క్లాస్ పీకాడట. ‘‘నేను చిత్రాలు చేయడం లేదని చెప్పానుగా.. మళ్లీ నా దగ్గరికి ఎందకు వచ్చావు.. నేనెలా కనిపిస్తున్నాను నీకు’’ అంటూ సున్నితంగా క్లాసు పీకాడట పవన్ కళ్యాణ్. అది కాదండీ అంటూ.. ఇటు పొలిటికల్‌గా మీకు ఉపయోగపడుతుంది అంటూ కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడట ఆ డైరెక్టర్.

కానీ పవన్ ఆ డైరెక్ట్ మాట్లాడే ఛాన్స్ ఇవ్వకపోవడంతో సదరు డైరెక్టర్ నిరాశకు లోనయ్యాడట. ఏదేమైనా ఇప్పుడు ఇది ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారి వైరల్ అవుతోంది.

Related posts:
పెళ్లి కుదిరిన హీరోతో సోనాక్షి డేటింగ్‌...బీ టౌన్‌లో హాట్ టాపిక్‌
అఖిల్ హీరోయిన్‌పై కుర్ర హీరో క‌న్ను!!
‘అల్లుడికి ప్రేమతో’.. జగపతిబాబు సంచలన వ్యాఖ్యలు
పవన్‌కళ్యాణ్ అసలైన ‘టార్గెట్’ అది.. మరి సాధించగలుగుతాడా?
100 కోట్ల డీల్‌లో అడ్డంగా బుక్కైన తారక్..?
రానాతో ఎన్టీఆర్‌కి ట్విస్ట్ ఇచ్చిన బాలయ్య.. 28కి ‘మే’ళం

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.