మహేష్ కామెంట్స్‌కి ప్రాణం పోసిన పవన్ ఫ్యాన్స్.. మరీ ఇంత వెర్రినా?

‘‘హీరోలపై అభిమానం ఉండటం తప్పు కాదు కానీ.. ‘తొండ ముదిరి ఊసరవెల్లి’ అన్న చందంగా మరీ పిచ్చిగా ఉండకూడదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి అంతకుమించే వెర్రి ఉంది’’ అంటూ చాలారోజుల నుంచి కత్తి మహేష్ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. అభిమానం పేరిట వాళ్లు అరాచకాలకి పాల్పడుతున్నారని, టెర్రరిస్టుల కంటే దారుణంగా తయారవుతున్నారంటూ కత్తి మాటల తూటాలు ఇదివరకే పేల్చాడు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు ఆజ్యం పోస్తూ ఒక సంఘటన వెలుగు చూసింది. తమ హీరో అభిమానినే ఫ్యాన్స్ విచక్షణారహితంగా కొడుతూ, తమ తిక్కకి లెక్క ఏమాత్రం లేదంటూ నిరూపించారు. అవును.. తమ తోటి సభ్యుడ్నే పవన్ ఫ్యాన్స్ చితకబాదిన ఘటన ఒక వెలుగులోకి వచ్చింది. పదండి.. దాని విశేషాలేంటో మేటర్‌లోకి వెళ్లి తెలుసుకుందాం!

పవన్, త్రివిక్రమ్ కాంబోలో భారీ అంచనాల మధ్య వచ్చిన ‘అజ్ఞాతవాసి’ మూవీ ఎంత దారుణంగా నిరుత్సాహపరిచిందో అందరికీ తెలుసు. ముఖ్యంగా.. పవన్ ఫ్యాన్స్ ఈ మూవీ చూశాకా చాలా అప్‌సెట్ అయ్యారు. ఆ అసంతృప్తిని దిగమింగుకోలేక ప్రీమియర్స్ తర్వాతే వెళ్లగక్కారు కూడా! వీరిలాగే మరో పవన్ వీరాభిమాని కూడా తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. కాకపోతే ఇతను కాస్త ఓవర్ చేశాడులెండి. పవన్ ఫోటో ఉన్న ‘అజ్ఞాతవాసి’ పోస్టర్‌పై చెప్పుతో కొడుతూ.. తన రూ.100 వేస్ట్ అయ్యాయంటూ దుర్భాషలాడాడు. పవన్‌పై ఉమ్ముతూ తిట్లపురాణం సంధించాడు. తన బాధేంటో ప్రైవేట్‌గా వెలిబుచ్చుకోవాల్సిందిపోయి.. మనోడు మొత్తం తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. అదిచూసి రగిలిపోయిన పవన్ వీరాభిమానులు.. వెంటనే రంగంలోకి దిగి, ఆ అబ్బాయి ఆచూకీ తెలుసుకుని చితకబాదారు. ఇలాంటి పని ఎందుకు చేశావంటూ విచక్షణారహితంగా చితక్కొట్టారు.

తెలిసో తెలియకో తానీ పొరపాటు చేశానని, దయచేసి తనని క్షమించమని ఆ అబ్బాయి వేడుకుంటున్నా.. ఫ్యాన్స్ మాత్రం వినిపించుకోకుండా రప్ఫాడించేశారు. ఫైనల్‌గా.. పోస్టర్‌లో ఉన్న పవన్ ఫోటోని మొక్కించి, క్షమాపణలు చెప్పించి వదిలిపెట్టారు. అంతటితో ఆగకుండా.. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారందరికీ ఇలాగే శిక్షిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. సినిమా నచ్చకుంటే చూడొద్దని, అంతేకానీ ఇలాంటి దిగజారుడు పనులు చేయొద్దని, పవన్‌ని అవమానిస్తే తాము సహించబోమని చెప్పారు. వీళ్లు కొట్టకుండా సంయమనం పాటిస్తూ సాఫీగా హెచ్చిరంచి ఉంటే బాగుండేది కానీ.. అతను చేసిన వెర్రి పనికి తామేమీ తీసుకోమంటూ మరింత వెర్రితనంగా ప్రవర్తించి కొట్టడమే ఇక్కడ సంచలనంగా మారింది. మొత్తానికి.. మహేష్ చేసిన కామెంట్స్‌ని వీళ్లు నిజం చేసి చూపిస్తున్నారు.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.