పవన్ ఇంట్లో విషాదమా.. ఇదేం వెటకారం!

సోషల్ మీడియాకి అడ్డం పెట్టుకుని కొందరు లేనిపోని వార్తల్ని పుట్టించేస్తున్నారు. ఏం జరక్కపోయినా.. అక్కడేదో జరిగిపోయిదంటూ చిన్న అగ్గిపుల్ల గీసేస్తారు. సోషల్ మీడియాలో అది అగ్గిరాజేసుకుని, యావత్ రెండు తెలుగు రాష్ట్రాల్లో మంట పుట్టించేస్తోంది. అలాంటి వార్తే ఒకటి పవన్ కళ్యాణ్ మీద తెగ హల్‌చల్ చేసింది. చివరికి పవన్ సన్నిహిత వర్గాలు అది అబద్ధమని చెప్పేంతవరకు ఫ్యాన్స్, నెటిజన్స్ కూల్ అవ్వలేదు. పదండి.. అంతలా అగ్గిరాజేసిన ఆ రూమర్ విశేషాలేంటో మేటర్‌లోకి వెళ్ళి తెలుసుకుందాం!

పవన్ మూడో భార్య అన్నా లెజినోవా తల్లి మరణించిందని.. దీంతో పవన్ ఫ్యామిలీ మొత్తం విషాదంలో మునిగిందని ఓ వార్త పుట్టికొచ్చింది. పవన్‌కి వున్న విపరీతమైన క్రేజ్ కారణంగా ఆ వార్త క్షణాల్లో వైరల్ అయిపోయింది. చివరికి ఈ విషాదంపై రేణుకూడా స్పందించిందని.. తన సంతాపం కూడా ప్రకటించిందని యూట్యూబ్‌లో వార్తల్ని కూడా క్రియేట్ చేసి పారేశారు. దీంతో.. ఈ వార్త నిజమేనని నెటిజన్స్, ఫ్యాన్స్ ఓ నిర్ణయానికొచ్చేశారు. తమ అభిమాన నటుడు బాధలో వున్నాడు కాబట్టి ఫ్యాన్స్ కూడా ఫీలయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పవన్ మేనేజర్.. వెంటనే స్పందించాడు.

అసలు పవన్ ఇంట్లో ఎలాంటి విషాదం చోటు చేసుకోలేదని.. అవన్నీ గాలివార్తలేనని ఆయన తేల్చి చెప్పాడు. పవన్ కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగానే వున్నారని.. అసలు ఇలాంటి వార్తలు ఎక్కడినుంచి పుట్టుకొస్తాయో అర్థం కావడం లేదని.. ఈ తరహా వార్తలొచ్చినప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోవాలని.. ఒకసారి నిజమో కాదో తెలుసుకున్నాకే పబ్లిష్ చేయాలని కోరారు.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.