‘మీకు ఊపొస్తుందేమో.. కానీ నాకు కాదు’ : ఆ నిజాయితీ కే పవనంటే పడి చస్తారు

తమ అభిమాన నటుడైన పవన్ కళ్యాణ్ మీద ఫ్యాన్స్ ఏ రేంజులో ప్రేమ కురిపిస్తారో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వేరే ఈవెంట్లలోనే కేవలం పవన్ ప్రస్తావన వస్తే చాలు.. ‘పవర్‌స్టార్’ నామజపంతో ఈ ఫంక్షన్‌నే దడ పుట్టించేస్తారు. కేకలు, కేరింతలతో షేక్ చేసి పడేస్తారు. అలాంటిది స్వయంగా పవన కళ్యాణే తమ ముందుంటే ఊరికే ఉంటారా..? రచ్చరంబోలా చేసేస్తారు. అలాంటి వాతావరణమే వైజాగ్‌లో కనిపించింది.

డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా డీసీఐ ఉద్యోగులు చేస్తున్న దీక్షకు మద్దతు ఇచ్చేందుకు పవన్ కళ్యాణ్ వైజాగ్‌కి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా లక్షల సంఖ్యలో విచ్చేసిన ఫ్యాన్స్.. తమ అభిమానం చాటుకోవడానికి కాస్త అత్యుత్సాహం ప్రదర్శించారు. పవన్ ప్రసంగిస్తున్న సమయంలో ‘సీఎం పవన్ కళ్యాణ్’ అంటూ నినదించారు. దీనిపై పవన్ వెంటనే తనదైన శైలిలో రియాక్ట్ అవుతూ.. ఫ్యాన్స్‌కి పవర్ పంచ్ ఇచ్చారు. ‘‘సీఎం పవన్ కళ్యాణ్ అనే నినాదం మీకు ఉత్సాహంగా ఉంటుందేమో.. కానీ నాకు కాదు. పదవులు బాధ్యతను తెస్తాయి. అయితే నాకు ఎలాంటి పదవులు లేకున్నా.. పెద్ద ఎత్తున బాధ్యత ఉంది. ఆ బాధ్యత నుంచి నేను పారిపోను’’ అని పవన్ రియాక్ట్ అయ్యారు.

నిజానికి.. ఇలా ఎవరైనా తమకు మద్దతుగా పొగడ్తల వర్షం కురిపిస్తే ఎవ్వరైనా గౌరవంతో ఉప్పొంగిపోతారు. వారితో మరింత ప్రశంసలు కురిపించుకోవడం కోసం మరో అడుగు ముందుకేసి, వారిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తారు. కానీ.. పవన్ అలా చేయలేదు. తన బాధ్యత నిర్వర్తించేందుకు రాజకీయాల్లోకి వచ్చానని, తనకు ఎలాంటి పదవులు అవసరం లేదంటూ ఫ్యాన్స్ నోళ్లు మూయించి, శభాష్ అనిపించుకున్నాడు. లీడర్‌గా పవన్ మరో మెట్టు ఎక్కాడని చెప్పడానికి ఇంతకంటే ఇంకేం రుజువు కావాలి? హ్యాట్సాఫ్ పవన్ కళ్యాణ్!!

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.