భలే షాకిచ్చిన పవన్-సూర్య.. కారణం కూడా బలమైనదే!!

Pawan Kalyan SJ Surya Latest Movie Launched

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు ఎస్‌జే సూర్య దర్శకత్వంలో ఓ మూవీ రూపొందనుందని గతకొన్నాళ్ళ నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ.. కన్ఫమ్ అయినట్లు టాక్ వినిపించింది. అంతేకాదు.. ఈ మూవీని ఈనెల 29న లాంచ్ చేయనున్నట్లు వార్తలు కూడా వినిపించాయి. కానీ.. సడెన్‌గా ఈ మూవీని ఈరోజే (27-04-2016) ప్రారంభించేశారు. హైద్రాబాద్‌లోని నిర్మాత శరత్ మరార్ కార్యాలయంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది.

ఈ సినిమాని ఇంత సడెన్‌గా ప్రారంభించడానికి ఓ బలమైన కారణం కూడా వుంది. అదేమిటంటే.. 15 ఏళ్ల క్రితం ఇదే రోజున పవన్, సూర్యల కాంబినేషన్‌లో వచ్చి సంచలనం సృష్టించిన ‘ఖుషీ’ సినిమా విడుదలైంది. ఆ మూవీ 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తమ చిత్రాన్ని మొదలుపెట్టాలని ఉద్దేశంతో పవన్, సూర్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ‘ఖుషీ’కి సీక్వెల్‌గా ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఓ ప్రేమకథగా ఈ మూవీ తెరకెక్కనుందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు ‘హుషారు’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను చిత్రబృందం మరికొన్ని రోజుల్లో వెలువడించనుంది.

భారీ అంచనాల మధ్య ఉగాది కానుకగా వచ్చిన ‘సర్దార్ గబ్బర్ సింగ్‍’.. ఆ అంచనాలను అందుకోలేకపోవడం ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. వారికి ఎలాగైనా హిట్ అందించాలన్న ఆలోచనతో పవన్ వెంటనే తన కొత్త సినిమాను మొదలుపెట్టినట్లు చెప్పుకుంటున్నారు. ఏదేమైనా.. తమ అభిమాన నటుడి చిత్రం ఇంత త్వరగా ప్రారంభం కావడంతో ఫ్యాన్స్ అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

pawan-surya-launch-01

pawan-surya-launch-02

pawan-surya-launch-03

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.