శ్రీరెడ్డిపై పవన్ కామెంట్ అదిరింది!

టాలీవుడ్‌ను గతకొద్ది రోజులుగా గడగడలాడించింది శ్రీరెడ్డి. ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న క్యాస్టింగ్ కౌచ్ విషయంలో శ్రీరెడ్డి రేపిన దుమారం మామూలుగా లేదు. గతకొద్ద రోజులుగా ఇదే టాపక్‌పై తెలుగు జనాలు ముచ్చటించుకుంటున్నారు. కాగా శ్రీరెడ్డి తన నిరసనను అర్ధనగ్న ప్రదర్శనతో మరోలెవెల్‌కు తీసుకెళ్లింది. దీంతో వెంటనే స్పందించిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ ఆమె చేసిన పనిని తప్పు పట్టి ఆమెను ఫిలిం ఇండస్ట్రీ నుండి బహిష్కరించారు. కానీ మళ్లీ తాజాగా ఆమెను ‘మా’లో చేర్చుకుంటున్నట్లు వారు స్పందించడంతో ఈ కథ ఒక కొలిక్కి వచ్చింది.

తాజాగా శ్రీరెడ్డి విషయంపై స్పందించాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తాజాగా పవన్ కళ్యాణ్ కతువా రేప్ కేసులో ఎనిమిదేళ్ల బాలిక ఆసిఫాపై అత్యాచారం, హత్యను చేసిన దుండగులను వెంటనే శిక్షించాలని నెక్లెస్‌రోడ్డు వద్ద నిరసన తెలిపారు. ఈ క్రమంలో మీడియాతో ఈ ఘటనకు సంబంధించి పవన్ మాట్లాడాడు. అయితే అక్కడ పవన్‌ను నటి శ్రీరెడ్డి ఇష్యూ గురించి ప్రశ్నించారు మీడియా వారు. తాను శ్రీరెడ్డి విషయంలో జరిగినదానిని పూర్తిగా ఖండిస్తున్నట్లు.. భాదితులు ఇలా నిరసనలు కాకుండా డైరెక్ట్‌గా పోలీస్ స్టేషన్ వెళ్లి లీగల్‌గా పోరాడాల్సింది అని చెప్పారు. మీడియాలో చర్చలు పెడితే సమస్యలు పరిష్యారం కావని.. పోలీసులను ఆశ్రయిస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని పవన్ చెప్పాడు.

అంతేగాక తన సినిమా షూటింగ్ సమయంలో కూడా కొందరు పోకిరీ మూకలు ఆడవారి పట్ల అసభ్యంగా ప్రవర్తించేవారని.. వారిని తాను స్వయంగా పట్టుకుని చితకబాదానని చెప్పాడు పవన్. చివరిగా మీడియా వారు ఇలాంటి విషయాల పట్ల జనాల్లో చైతన్యం తీసుకురావాలని కోరారు పవన్.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.