పవన్ దెబ్బకు ‘అజ్ఞాతం’లోకి మహేష్..?

హాలీవుడ్ సినిమాల్ని స్ఫూర్తిగా తీసుకుని.. తెలుగులో ఎన్నో చిత్రాల్ని రూపొందించారు. అంటే.. ఆ కథల్ని తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా మార్పులు చేసి.. స్ర్కిన్‌ప్లే కూడా డిఫరెంట్‌గా రాసుకుని, మూవీల్ని తెరకెక్కించారు. కొందరైతే ఏకంగా కథల్ని కాపీ కొట్టేసి, ఫ్రీమేక్ చేసిన సందర్భాలూ ఉన్నాయి. కాకపోతే అప్పట్లో ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. కాపీ విమర్శలు వచ్చినా.. పెద్దగా వివాదం అయ్యేవి కావు.

కానీ.. ‘అజ్ఞాతవాసి’ మూవీ విషయంలో మాత్రం చాలా పెద్ద రచ్చే జరిగింది. షూటింగ్ సమయంలోనే అది ఫ్రెంచ్ మూవీ ‘లార్గో వించ్’కి కాపీ అని విమర్శలొచ్చాయి. ఇక టీజర్, ట్రైలర్లు రిలీజయ్యాక దాదాపు అది నిజమేనని ప్రూవ్ అయ్యింది. దీంతో.. రిలీజ్ టైంలో ఈ మూవీకి చాలా ఇబ్బందులు తలెత్తాయి. ‘లార్గో వించ్’ రైట్స్ తీసుకున్న టీ-సిరీస్ వాళ్లు లీగల్ నోటీసులు పంపేందుకు రెడీ అవ్వడం.. చివరికి చిత్రబృందం వాళ్లతో సీక్రెట్ డీల్ కుదుర్చుకోవడం.. అబ్బో పెద్ద రాద్ధాంతమే జరిగింది.

ఇప్పుడిదే భయం మహేష్ బాబు 24వ చిత్రం ‘భరత్ అనే నేను’కి చుట్టుకున్నట్లు సమాచారం. ఎందుకంటే.. ఈ మూవీ కూడా 90లో వచ్చిన ఓ హాలీవుడ్ కథ ఆధారంగా రూపొందుతోందని ఫిల్మ్ నగర్‌లో రూమర్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ మూవీ స్ర్కీన్‌ప్లే డిఫరెంట్‌గా వుంటే కాపీ వివాదం తలెత్తదు కానీ.. ఆ హాలీవుడ్ చిత్రానికి పోలివుంటే మాత్రం ఖచ్చితంగా రిలీజ్ టైంలో ఇబ్బందులు తలెత్తడం ఖాయం.

మరి.. శ్రీహరి నానుతో కలిసి ఈ కథని రెడీ చేసిన కొరటాల శివ.. డిఫరెంట్ స్ర్కీన్‌ప్లే రాసుకున్నాడా? లేక ఆ ఇంగ్లీష్ సినిమాకి కాపీ కొట్టేశాడా? తెలియాలంటే.. రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ‘అజ్ఞాతవాసి’ వివాదం గురించి వీళ్లకు తెలుసు కాబట్టి.. ముందు జాగ్రత్తగా మార్పులు చేస్తే మంచిది. చూద్దాం.. ‘భరత్’ కూడా అజ్ఞాతంలోకి వెళ్తాడా? లేదా కొత్త కథతో ప్రేక్షకుల్ని రంజింపచేస్తాడా?

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.