తారక మంత్రానికి పూజా మరింత ‘ఫ్లాట్’

అవును.. స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ల పాత్రలు గొప్పగా వుండవు. అలాగని మరీ ఇంపార్టెన్స్ వుండదని కాదు.. కొంచెమైనా ప్రాధాన్యం ఉంటుంది. ఆ కాసేమైనా హీరోకి తగ్గట్టు తమ సత్తా చాటుకోవాలని వాళ్ళు పడే అవస్థలు అంతాఇంతా కాదు. నటన, డ్యాన్స్, డైలాగ్ డెలివరీ.. ఇలా అన్నింటిలో హీరోకి పోటీగా కాకపోయినా అతని స్థాయికి మ్యాచ్ అయ్యేలా కసరత్తు చేస్తుంటారు. లేటెస్ట్‌గా సెక్సీ బ్యూటీ పూజా హెగ్డే అలాంటి కసరత్తులే చేస్తోంది. తారక్ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు తనను తాను మార్చుకోవడానికి తెగ ఎక్సర్‌సైజ్ చేస్తోంది.

త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తారక్ కథానాయకుడిగా రూపొందుతున్న ప్రాజెక్ట్‌లో పూజా హెగ్డే కథానాయికగా ఎంపికైన విషయం అందరికీ తెలిసిందే! ఇందులో తారక్ కండలు పెంచి, బాడీలోని ఎక్స్ట్రా ఫ్యాట్ తగ్గించేసి ఫిట్‌గా రెడీ అయ్యాడు. మరింత ఫిట్‌గా, హ్యాండ్సమ్‌గా తయారయ్యేందుకు తారక్ ఇంకా కసరత్తులు చేస్తూనే వున్నాడు. తారక్ అలా అందంగా తయారైనప్పుడు తాను కూడా అలా రెడీ అవ్వాలనుకుంది పూజా హెగ్డే. అందుకే.. ఈ అమ్మడు వీలు దొరికిన ప్రతిసారి వర్కవుట్స్ చేస్తోంది. రెగ్యులర్‌గా అందరూ చేసేట్టు కాకుండా ముందునుంచి పూజా హెగ్డే ఏరియల్ యాక్రోబాటిక్స్ చేస్తోంది.

నిజానికి.. పూజాది ప‌ర్‌ఫెక్ట్‌ ఫిగర్. ‘డీజే’లో ఆమె సెక్సీగా కనిపించడంతోపాటు బన్నీకి పోటీగా డ్యాన్సులు ఇరగదీసేసింది. అలాంటి ఆమెకి ప్రత్యేకంగా వర్కవుట్స్ చేయాల్సిన అవసరం లేదు. అయితే.. తారక్ మేకోవర్ చూసి మరింత స్లిమ్‌గా తయారవ్వాలని డిసైడ్ అయ్యింది. సో.. ఈ చిత్రంలో పూజాని మరింత బ్యూటిఫుల్‌గా దర్శనమివ్వనుందన్నమాట!

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.