‘నంది’ వివాదంపై పోసాని ఫైర్.. ఏపీ ప్రభుత్వాన్ని ఏకిపారేశాడు!

posani krishna murali fires on ap government in nandi controversy

నంది వివాదం రోజురోజుకూ అగ్గిరాజుకుంటోంది. ముఖ్యంగా.. నారాలోకేష్ ‘నందిపై విమర్శలు చేస్తున్నవాళ్లంతా ఏపీకి చెందినవారు కాదని, వాళ్లకి ఏపీలో ఆధార్-ఇతర కార్డులు లేవని’ చెప్పినప్పటి నుంచి మరింత తీవ్రం అయ్యింది. నారాలోకేష్ వ్యాఖ్యలు జీర్ణించుకోలేక సెలెబ్రిటీలందరూ మూకుమ్మడిగా దాడిచేస్తున్నారు. ఇక పోసాని కృష్ణమురళి అయితే ఏకంగా ప్రెస్‌మీట్ పెట్టి ఏపీ ప్రభుత్వాన్నే ఏకిపారేశారు. చంద్రబాబు, నారాలోకేష్ చేసిన వ్యాఖ్యల్ని ఎత్తిచూపుతూ.. రివర్స్‌లో ప్రశ్నల వర్షం కురిపించారు. ఆయన ఏమన్నారంటే..

‘‘జ్యూరీ ప్రకటించిన నంది అవార్డుల్లో ఎక్కడో లోపం ఉంది.. దాన్ని సరిదిద్దుకోండని చెప్పినందుకు మేం ఆంధ్రాకి చెందినవాళ్లం కాదా! ‘లోకేష్‌లాంటి మనస్థత్వం తెలంగాణవాళ్లకు ఉండి ఉంటే.. ఇక్కడ ఆంధ్రావాళ్లు పిచ్చికుక్కల్లా తన్నులు తింటూ పారిపోయేవారు. బర్మాలో ముస్లిం రోహింగ్యాలలాగే మేము తెలుగు రోహింగ్యాలయ్యేవాళ్లం. ఏమయ్యా లోకేషూ.. మీ కుటుంబసభ్యులకు హైదరాబాద్‌లో సొంత ఇళ్లు లేవా? మీరు ఇక్కడ ట్యాక్స్ కట్టడం లేదా? మేము ఇక్కడ ట్యాక్స్ కట్టి.. అక్కడ విమర్శలు చేయకూడదా? మీరు ఇక్కడ ట్యాక్స్ కడుతూ ఇళ్లు కట్టుకుంటూ.. విజయవాడలో రాజకీయాలు చేయొచ్చా? మీ కుటుంబసభ్యులకు ఏపీలో ఆధార్ కార్డులు ఉన్నాయా? నీకు ఇక్కడ ఇల్లు ఉంది. ఇక్కడ ట్యాక్స్ కడతావు.. అక్కడ మంత్రి అవుతావు. మేమేం కాకూడదు. నోరెత్తాం.. తప్పా?’’ అని పోసాని దాడి చేశారు.

ఇంకా మాట్లాడుతూ.. ‘‘ఏమన్నావ్.. రాద్ధాంతం చేస్తే నందులు ఎత్తేస్తావా? తెలుగు ప్రజలు శృతిమించే రాద్ధాంతం చేస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు మీరు ఎన్ని ఎత్తేశారు? నువ్వు ఈ చిన్నదానికే నందులు తీసేస్తానన్నావే.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన భారతరత్నపైనా విమర్శలున్నాయి. అలాగే పద్మ అవార్డులపైనా ఆరోపణలు వచ్చాయి. మరి వాళ్లు ఎత్తేస్తామన్నారా? ఎత్తేశారా? వాళ్లూ విమర్శలు స్వీకరిస్తున్నారు కదా..! కాంగ్రెస్, బీజేపీ రెండు ప్రభుత్వాలు విమర్శలు ఎదుర్కున్నాయి. ప్రజాస్వామ్యం అన్నాక విమర్శలు రాకూడదంటే ఎలా?’’ అని పోసాని కృష్ణమురళి ప్రశ్నించారు. ఇంకా ఆయన ఏమన్నారో క్రింది వీడియోలో చూడండి..

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.