రామ్‌చరణ్ 80.. ప్రభాస్ 70!

రామ్ చరణ్ తన లేటెస్ట్ మూవీ ‘రంగస్థలం’తో 1980 నాటి రోజుల్ని గుర్తు చేశాడు. ఆనాటి మనుషులు, అప్పటి వాతావరణం ఎలా ఉంటాయో దర్శకుడు సుకుమార్ సూపర్‌‌గా ప్రెజెంట్ చేసి.. మనుషుల హృదయాల్ని దోచుకున్నాడు. లేటెస్ట్‌గా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కూడా మరో పదేళ్ళ వెనక్కు వెళ్లి.. తన అద్భుతమైన ప్రేమకథని ప్రేక్షకులకు అందించేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం!

ప్రస్తుతం ‘సాహో’ సినిమా చేస్తున్న ప్రభాస్.. దీని తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో చేయనున్నాడు. ఇదివరకు ఇదో లవ్ స్టోరీ అని స్వయంగా దర్శకుడు వెల్లడించాడు. దాన్ని బట్టి ఇది ‘డార్లింగ్’ సినిమా తరహాలో ఉండొచ్చని అనుకున్నారు. కానీ.. ఈ మూవీ అలా రొటీన్‌గా ఉండదని.. 1970 బ్యాక్‌డ్రాప్‌లో అల్లుకుని ఉంటుందని ఫిలింనగర్ టాక్! అంతేకాదండోయ్.. ఇందులోనూ ప్రభాస్ ‘బాహుబలి’లోలాగా కొండలు, అడవుల్లో తిరుగుతాడని ప్రచారం! అంటే.. టార్జాన్ తరహాలో అన్నమాట!

1970 బ్యాక్‌డ్రాప్ అన్నాక ఆనాటి పరిస్థితుల్ని చూపించాలి కాబట్టి.. ఆ కాలంనాటి ట్రైన్స్, షిప్స్ వంటి పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీని కూడా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు తెలిసింది. సో.. ఇందులో భారీతనాన్ని ఆశించవచ్చన్నమాట! త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకి వెళ్ళనుంది.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.