అదే కొంప ముంచిదన్న సత్తారు.. పాపం రామ్!

టాలీవుడ్‌లో మోస్ట్ ట్యాలెంటెడ్ దర్శకులుగా పేరొందిన వాళ్ళలో ప్రవీణ్ సత్తారు ఒకడు! మొదట్లో ఇతనికి తగిన గుర్తింపు పెద్దగా రాలేదు కానీ.. ‘పీఎస్వీ గరుడవేగ’తో మాత్రం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయాడు. అది కమర్షియల్‌గా వర్కౌట్ అవ్వకపోయినా.. హాలీవుడ్ సినిమా రేంజులో చాలా థ్రిల్లింగ్‌గా రూపొందించినందుకు.. ప్రవీణ్‌కి బోలెడంత ఇమేజ్ వచ్చింది. ఇక అప్పట్నుంచి అతని తదుపరి చిత్రం ఎవరితో? ఎలా ఉంటుంది? అనే క్యూరియాసిటీ నెలకొంది.

కొన్ని నెలలు బాగా గ్యాప్ ఇచ్చాక.. చివరికి ఎనర్జిటిక్ హీరో రామ్‌తో ఓ మూవీ చేస్తున్నానని ప్రవీణ్ వెల్లడించాడు. ఈ కాంబో కాస్త క్రేజీగా అనిపించడంతో.. ఈ జంట పక్కాగా ఏదో ఒక మ్యాజిక్ చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ.. ఈ ఆశలు అప్పుడే నీరుగారిపోయాయి. ఏదో మ్యాజిక్ చూస్తామనుకుంటే.. అసలు మెజీషియన్సే లేకుండా పోయారు. అంటే.. ఈ జంట కలిసిన కొద్దిరోజుల్లోనే విడిపోక తప్పలేదు. అందుకు బడ్జెట్ సరిగ్గా సెట్ కాకపోవడమే కారణం! గతకొన్నిరోజుల నుంచి ఈ వార్త చక్కర్లు కొడుతున్నా.. ఏదో రూమర్ అనుకున్నారు. కానీ ఇది నిజమేనని లేటెస్ట్‌గా ప్రవీణ్ తేల్చి పారేశాడు.

‘‘రామ్‌తో మిలటరీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక సినిమా ప్లాన్ చేశాను. క్వాలిటీ విషయంలో నేను రాజీ పడను కాబట్టి కాస్త బడ్జెట్ ఎక్కువే అవుతుంది. బడ్జెట్ రికవర్ అవుతుందని నాకూ, రామ్‌కి నమ్మకం ఉన్నప్పటికీ.. పెట్టుబడి పెట్టాల్సిన వారికి భరోసా కలగలేదు. అందుకే.. ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది’’ అంటూ ప్రవీణ్ సత్తారు క్లారిటీ ఇచ్చేశాడు. ఈ సినిమాతో రామ్‌కి తిరిగి పూర్వవైభవం వస్తుందనుకుంటే.. ఆదిలోనే ప్రాజెక్ట్ ఆగిపోవడం అతని బ్యాడ్‌లక్!

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.