హెబ్బా మోజులో కోట్లు తగలబెట్టేసిన నిర్మాత..?

hebbah-angel-budget
Tellmeboss.net

కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోయిన్‌కి కాస్త క్రేజ్ వస్తే చాలు.. నిర్మాతలందరూ వాళ్ల వెనుకే పరుగులు పెడతారు. వాళ్ల క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాలని నువ్వా-నేనా అన్నట్లుగా పోటీ పడతారు. ఎలాగైనా తమ సినిమాల్లో తీసుకోవాలని ఫిక్స్ అయ్యి, భారీ డబ్బులు ముట్టజెప్పడానిక్కూడా సై అంటారు. వీరిలాగే అత్యుత్సాహంతో ముందుకొచ్చిన ఒక నిర్మాత.. హెబ్బాపై ఊహించని స్థాయిలో డబ్బులు తగలబెట్టేశాడు. ఇప్పుడు ఈ విషయమై ఇండస్ట్రీలో అందరూ చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఆ నిర్మాత ఎవరు? అని అనుకుంటున్నారా! మరెవ్వరో కాదు.. సింధూరపువ్వు కృష్ణారెడ్డి.

Tellmeboss.net

తన తనయుడ్ని ఇండస్ట్రీలో హీరోగా రాణించాలని తపన పడుతున్న ఆయన.. ప్రస్తుతం ‘ఏంజెల్’ సినిమాని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ మొదలయ్యి చాలాకాలమే అయ్యింది. ఈ సినిమా స్టార్టింగ్ టైమ్‌లో హెబ్బా పటేల్‌ వరుస విజయాలతో ఫుల్ స్వింగ్‌లో వుండటంతో.. భారీ రెమ్యునరేషన్ ఇచ్చి ఆమెను కథానాయికగా ఎంపిక చేసుకున్నారు. పైగా.. ఈ సినిమా హీరోయిన్ రోల్ చుట్టే అల్లుకుని వుంటుంది కాబట్టి, తన తనయుడిగా జోడిగా మాంచి ఊపుమీదున్న హెబ్బా అయితే సరిపోతుందని కృష్ణారెడ్డి భావించి, ఆమెకి మంచి పారితోషికం ఇచ్చి తీసుకున్నారు. అంతటితో ఆగలేదండోయ్.. ఆమెపై మరింత ఖర్చు చేశారు.

ఒక సోషియోఫాంటసీ చిత్రం అయిన ‘ఏంజెల్’లో గ్రాఫిక్స్ వర్క్ చాలా వుంది. అందులో హెబ్బా చేసిన ఎపిసోడ్స్‌కే ఎక్కువ సీజీ సీన్లు వున్నాయి. వాటికోసం యూనిట్ కొన్ని కోట్లు ఖర్చు పెట్టింది. మొత్తంగా చూసుకుంటే.. ‘ఏంజెల్’ మూవీకి 8 కోట్లు అవ్వగా, అందులో హెబ్బాకి ఇచ్చిన రెమ్యునరేషన్, ఆమెపై తీసిన గ్రాఫిక్స్ ఎపిసోడ్స్‌కి కలిపి 65% పైనే అయ్యిందని అంటున్నారు. ఇదండి అసలు మేటర్. అప్పట్లో కెరీర్ పీక్స్‌లో వుండటంతో హెబ్బాని ఈ చిత్రంలో తీసుకుని.. నిర్మాత కోట్లు ఖర్చు పెట్టింది. మరి.. అంత అమౌంట్ తిరిగి వస్తుందా? లేదా? అన్నది వేచి చూడాలి.

Tellmeboss.net
Related posts:
హామీలు అమలు చెయ్యలేకపోతే రాజీనామా చెయ్యండి - రజినీకాంత్
అలాంటి ఫీట్లు అనవసరంగా చేశానంటున్న బాలయ్య
గజిని కమెడియన్‌కు చేదు అనుభవం.. చెప్పులు విసిరిన పబ్లిక్
మణిరత్నం సినిమాను కొట్టేసిన ప్రొడ్యూసర్
‘జనతా గ్యారేజ్’ 16 రోజుల కలెక్షన్స్ వివరాలు
లై మూవీ వరల్డ్‌వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్.. డిజాస్టర్‌కి కేరాఫ్!

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.